జోరుగా ఏసీబీ తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

జోరుగా ఏసీబీ తనిఖీలు

Mar 12 2026 7:11 AM | Updated on Mar 12 2026 7:11 AM

తిరుపతి తుడా: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కార్పొరేషన్‌ పట్టణ ప్రణాళిక విభాగంలో ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) నిర్వహించాయి. రెండవ రోజు బుధవారం తిరుపతిలో ఏసీబీ అధికారులు ఐదు బృందాలుగా క్షేత్రస్థాయికి వెళ్లి టౌన్‌ ప్లానింగ్‌ రికార్డుల ఆధారంగా పలు భవనాలను తనిఖీ చేశారు. బైరాగి పట్టెడ, ఉపాధ్యాయ నగర్‌, రెడ్డి గుంట, రాక్‌ స్టాక్‌ హోటల్‌, లక్ష్మీపురం సర్కిల్లోని పలు భవనాలను తనిఖీ చేశారు. అనంతరం ఏసీబీ అధికారులు మీడియాతో మాట్లాడుతూ, పలు భవనాలకు సెట్‌ బ్యాక్‌ వదల్లేదని, ప్లానుకు విరుద్ధంగా నిర్మాణాలు కొనసాగుతున్నాయని, అదనపు అంతస్తులను గుర్తించామని చెప్పారు. నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు. ఇదలా ఉంచితే, అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించుకోమని ప్రభుత్వమే ఉత్తర్వులు జారీ చేసినప్పుడు తమ భవనాలపై ఏసీబీ అధికారులు దాడులు ఎందుకు చేస్తున్నారో తెలియడం లేదని పలువురు నిర్మాణదారులు ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది భవన నిర్మాణదారులను ఉసిగొల్పి ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement