ఎస్సీ, ఎస్టీ సమస్యలపై 23న ప్రత్యేక పీజీఆర్‌ఎస్
తిరుపతి అర్బన్: ఎస్సీ, ఎస్టీ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 23వ తేదీన కలెక్టరేట్‌లో ఉదయం 10 గంటల నుంచి ప్రత్యేక పీజీఆర్‌ఎస్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు. సోమవారం మధ్యాహ్నం ఆయన కలెక్టరేట్‌లో ఎస్పీ సుబ్బరాయుడు, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ మౌర్య, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాన్సీ, డీఆర్వో నరసింహులతో కలసి పీజీఆర్‌ఎస్ నిర్వహణతోపాటు పలు సమస్యలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు పీజీఆర్‌ఎస్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే 23వ తేదీ సాయంత్రం 4 గంటలకు కలెక్టరేట్‌లో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై పీజీఆర్‌ఎస్ చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. రీసర్వే పూర్తి అయిన గ్రామాల్లో ప్రతి నెల 2 నుంచి 9వ తేదీ వరకు పాస్ పుస్తకాలు జారీ చేయాలన్నారు. మార్చి 10 నుంచి పదోతరగతి పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు.
గణతంత్ర దినాన్ని వేడుకగా నిర్వహిద్దాం
ఈనెల 26న తిరుపతిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో గణతంత్ర దిన వేడుకలను వేడుకగా నిర్వహిద్దామని కలెక్టర్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం పర్యావేక్షణ పూర్తి బాధ్యత తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్‌కు అప్పగిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు డీఈఓ కేవీఎన్ ఈ కార్యక్రమంలో అడిషనర్ ఎస్పీ రవిమనోహరాచారి, ఆర్డీఓ రామ్మోహన్, డ్వామా పీడీ శ్రీనివాస ప్రసాద్, తుడా సెక్రటరీ శ్రీకాంత్, డీఈఓ కేవీఎన్ కుమార్, డీఐపీఆర్‌ఓ గురుస్వామి శెట్టి పాల్గొన్నారు.


