దళితులపై అధికార పార్టీ కుట్ర
రేణిగుంట: మండలంలోని కరకంబాడి పంచా యతీ దొడ్లమిట్ట దళితవాడకు చెందిన చలపతి అనే దళితుడు ఆంజనేయపురం సమీపంలో ఉన్న కడప– చైన్నె రహదారి పక్కన హోటల్ పెట్టుకుని బతుకుదాం.. అనుకుని కరకంబాడిలోని రామ య్య స్వాధీన అనుభవంలో ఉన్న ఎకరా భూమి లోని మామిడి తోటను ఆరేళ్లు లీజుకు తీసుకుని రూ.లక్షలు ఖర్చు పెట్టి నిర్మాణాలు చేపట్టారు. 4 నెలలుగా నిర్మాణ పనులు చేస్తున్నారు. పంచా యతీ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకుని కరెంటు సరఫరా తీసుకున్నారు. రూ.లక్షలు ఖర్చుపె ట్టి రెండు రోజుల్లో హోటల్ ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంతలో స్థాని క అధికార పార్టీ నాయకులు అతన్ని వైఎస్సార్ సీపీ సానుభూతిపరుడిగా ముద్ర వేసి కక్ష సాధింపు చర్యలు మొదలుపెట్టారు. అందులో భాగంగా రెవెన్యూ అధికారులను శనివారం సాయంత్రం హోటల్ వద్దకు పంపి, ప్రభుత్వ భూమిలో హో టల్ నిర్మించుకున్నారని చెబుతూ కూల్చేందుకు ప్రయత్నించారు. ఎటువంటి ముందస్తు నోటీసు లు ఇవ్వకుండా ఇలా ఉన్నఫళంగా వచ్చి కూల్చివేస్తామంటే ఎలా అని చలపతి కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. తమకు పంచాయతీ నుంచి అను మతులు తీసుకున్నామని, ఎంత చెప్పినా రెవె న్యూ అధికారులు సర్వే నంబర్ 59లోని సుమారు 20 ఎకరాలు ప్రభుత్వ భూమిగా ఆన్‌లైన్‌లో ఉందని తెలుపుతూ, ఇందులో ఎటువంటి కట్టడాలు కట్టకూడదని చెప్పి జేసీబీతో హోటల్‌కు వేసిన ది మ్మెలను కూల్చివేశారు. హోటల్ ప్రధాన భవ నం కూల్చేందుకు ప్రయత్నించగా చలపతి కుటుంబంలోని మహిళలు పెట్రోల్ తీసుకుని కూల్చివే స్తే కాల్చుకుని మరణిస్తామని కూర్చున్నారు. రా త్రి 7 గంటల వరకు రెవెన్యూ అధికారులు కూ ల్చేందుకు ప్రయత్నాలు చేశారు. బాధిత కుటుంబం సమయం ఇవ్వాలని కోరగా రెండు రోజులు గడువు ఇచ్చి రెవెన్యూ అధికారు లు వెనుతిరిగి వెళ్లారు. చలపతి మాట్లాడుతూ దళితులమని తమపై కక్ష కట్టి స్థానిక అధికార పార్టీ నాయకులు రెవెన్యూ వారిని పంపించారన్నారు.
బాధితులకు అండగా వైఎస్సార్ సీపీ నేతలు
కరకంబాడి పంచాయతీలో జరుగుతున్న కక్ష సాధింపు చర్యల సంఘటనను తెలుసుకున్న శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆదేశాలతో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షు డు గంగారి రమేష్, పార్టీ పంచాయతీ నాయకులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచి భరోసా ఇచ్చారు.
దళితులపై అధికార పార్టీ కుట్ర
దళితులపై అధికార పార్టీ కుట్ర


