ఎర్రచందనం అక్రమ రవాణా నిర్మూలనే ధ్యేయం
తిరుపతి అన్నమయ్యసర్కిల్: ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడమే ఈ ఏడాదిలో ప్రధాన ధ్యే యంగా పెట్టుకుని గణనీయమైన విజయాలను సా ధించినట్లు టాస్క్‌ఫోర్స్ హెడ్, జిల్లా ఎస్పీ సుబ్బరా యుడు వెల్లడించారు. శనివారం ఆయన స్థానిక జిల్లా పోలీసు కార్యాలయ సభా ప్రాంగణంలో అక్రమ రవాణా ప్రత్యేక దళ వార్షిక సమగ్ర పనితీరు నివేదిక ను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ టాస్క్‌ఫోర్స్ విభాగం, అటవీశాఖ అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుని మెరుగైన ఫలితాలను సాధించినట్లు తెలిపారు. ఈ ఏడాదిలో 87.5 శాతం దోష నిర్ధారణ రేటు సాధించగా అందులో ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి 35,476 కిలోల బరువు కలిగిన 1,872 దుంగలు, 63 వాహనాలు సీజ్ చేశామన్నారు. 64 కేసుల నమోదులో 263 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. సీజ్ చేసిన ఎర్రచందనం విలువ సుమారు రూ. 216.5 కోట్లుగా అంచనా వేశామన్నారు. కాగా అక్రమ రవాణాలో క్షేత్రస్థాయి స్మగ్లర్లు, రవాణాదారులు, నిర్వాహకులు అలవాటైన నేరస్తులు ఉన్నారన్నారు. ఎర్రచందనం అరుదైన, విలువైన వృక్ష జాతి కావడం, దీనికి అంతర్జాతీయ డిమాండ్ ఉన్న కారణంగా సంఘటిత అంతర్ రాష్ట్ర స్మగ్లింగ్ ముఠాల లక్ష్యంగా మారుతోందన్నారు. 2025 సంవత్వరంలో సమగ్ర, గూఢదారి ఆధారిత, సాంకేతికతతో చట్టపరంగా బలమైన వ్యూహాన్ని అమలు చేశామన్నారు. 2016 నుంచి 2024 మధ్యకాలంలో నమోదైన కేసులకు సంబంధించి పరారీలో ఉన్న 52 మంది నిందితులను గుర్తించి, అరెస్టు చేయడంతో కోర్టు ప్రక్రియలను బలోపేతం చేసిందని గుర్తు చేశారు. చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు (సీసీఎఫ్) సెల్వం మాట్లాడుతూ ఈ ఏడాదిలో మొత్తం 920 ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో 816 ఎంట్రీ ఎగ్జిట్ ఆపరేషన్లు, 24 డి కాంబింగ్ ఆపరేషన్లు, 80 ప్రత్యేక 0 ప్లస్ 1 కాంబింగ్ ఆపరేషన్లు ఉన్నట్లు చెప్పారు. అనంతరం టాస్క్‌పోర్స్ బృంద సభ్యులకు నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. జిల్లా అటవీశాఖాధికారి సాయిబాబ, టాస్క్‌ఫోర్స్ ఏసీఎఫ్ జె.శ్రీనివాస్, ఏఎస్పీ కులశేఖర్, డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి, షరీఫ్ పాల్గొన్నారు.


