ఖండాంతరాలు దాటిన ఆదిత్య రాగం
ఆ బాలుడి స్వరం వీనులు చేరగానే హృదయం ఉప్పొంగిపోయింది.. గుండె గదుల్లో కళారాధన తొణికిసలాడింది.. ఆ రాగం మనస్సును పరవళ్లు తొక్కించింది.. ఒక్కొక్క కీర్తన మధురానుభూతిని కలిగించింది.. ఇదంతా ఏమిటా అనుకుంటున్నారా.. మన కళ ఖండాంతరాలు దాటినా చెక్కుచెదరలేదనడానికి నిదర్శనం. భారతీయ సంస్కృతి.. సంప్రదాయం.. కళలు ప్రపంచాన్ని కట్టిపడేస్తున్నాయనడాకి ఉదాహరణే ఆమెరికా సెంట్‌లూయిస్‌లో నివాసమున్న చెంగల్వ ఆదిత్య. విజయవాడకు చెందిన రమణమూర్తి బాలాత్రిపుర సుందరి దంపతుల మనవడు చెంగల్వ ఆదిత్య ప్రస్తుతం అమెరికా సెంట్ లూయిస్‌లో నివాసముంటున్నా. విదేశాల్లో ఉన్నప్పటికీ భారతీయ సంస్కృతి, భక్తి సంకీర్తనలపై మక్కువతో ఆదిత్య అన్నమయ్య సంకీర్తనాలాపన సాధన చేశాడు. ఆ బాలుడు శనివారం అన్నమయ్య కళామందిరంలో ఏర్పాటు చేసిన కచేరిలో ‘పొడగంటిమయ్యా పురుషోత్తమా’.. అని ఆలపిస్తుంటే అంతా నిశ్చేష్టులై విన్నారు. ఆ బాలుడు కళారాధనకు మెచ్చిన చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం ప్రతినిఽధి చిత్రపు హనుమంతరావు, సభ్యులు, పురోహితులు సురేష్ స్వామి, లోక ప్రభాకర్ నాయుడు, రంగస్థలి చైర్మన్ గోపినాథ్‌రెడ్డి, సుబ్రమణ్యంరెడ్డి ఆ బాలుడిని జ్ఞాపికతో ఘనంగా సత్కరించి అభినందించారు. – తిరుపతి కల్చరల్
ఖండాంతరాలు దాటిన ఆదిత్య రాగం


