తిరుపతిని ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం
తిరుపతి అర్బన్: జిల్లాను ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేద్దామని కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు. శనివారం కలెక్టరేట్ లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ బోర్డు సమావేశాన్ని ఇన్‌చార్జి జేసీ నారపురెడ్డి మౌర్యతో కలసి కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతిని ఎలక్ట్రానిక్స్, స్పేస్, అడ్వాన్స్‌డ్ ఎనర్జీ సిస్టమ్స్ రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టడానికి బోర్డు పలు వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుందామని చెప్పారు. ప్రాధాన్యత రంగాలైన ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్, స్పే స్ టెక్నాలజీ అడ్వాన్స్‌డ్ ఎనర్జీ సిస్టమ్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. తిరుపతి జిల్లాతో పాటు అనుబంధ జిల్లాల పారిశ్రామిక సామర్థాన్ని అంచనా వేస్తూ, ఆ ప్రాంతాల్లోను స్టార్టప్ వ్యవస్థాపకతను ప్రోత్సహించాలని తెలిపారు. సమావేశంలో ఆదాని, నవయుగ, అమరరాజా కంపెనీల ప్రతినిధులు, ఐఐటీ తిరుపతి బోర్డు సభ్యులు పాల్గొన్నారు.
బండారుపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌ను సందర్శించిన గుజరాత్ టీమ్
ఏర్పేడు: మండలంలోని బండారుపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలను శనివారం గుజరాత్ రాష్ట్రానికి చెందిన విద్యాశాఖ అధికారుల బృందం సభ్యులు సందర్శించారు. మధ్యాహ్న భోజనా న్ని పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా? అని ఆరా తీశారు. పాఠశాల లో అమలవుతున్న విద్యాపథకాలను గురించి తెలసుకున్నారు. విద్యార్థులను పాఠ్యాంశాల గురించి ప్రశ్నించి, ప్రతిభను పరీక్షించారు. పాఠశాల ఆవరణలో పచ్చని చెట్లు, ఆహ్లాదకరంగా ఉన్నాయని, పాఠశాల మౌలిక వసతులను వారు ప్రశంసించారు. ఇన్‌చార్జి హెచ్‌ఎం సుబ్రమణ్యం, పాఠశాల ఉపాధ్యాయులు చిట్టిబాబు, ద్వారకనాథరెడ్డి, కుమార రాజా, రాధాకుమారి, రామచంద్రయ్య, వెంకటేశులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తిలో భక్తుల రద్దీ
– ముందస్తు ప్రణాళిక లోపంతో ఇక్కట్లు
శ్రీకాళహస్తి: ముక్కంటీశ్వరాలయంలో శనివా రం భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఒక్కరోజే 30 వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా శని, ఆది, సోమవారాల్లో శ్రీకాళహస్తి ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. అయి తే ఈసారి తిరుమలలో 30వ తేదీ వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో ముందస్తుగానే ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో జిల్లాకు తరలివచ్చారు. ఈ ప్రభావం శ్రీకాళహస్తి ఆలయంపైనా పడింది. ఒక్కసారిగా 30 వేల మందికి పైగా భక్తులు రావడంతో ఆలయంలోని అన్ని క్యూలు కిక్కిరిసిపోయా యి. ముందస్తు ప్రణాళికలు, రద్దీ నియంత్రణ చర్యలు సరైన స్థాయిలో లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సమాచారం. గంటల తరబడి క్యూలో దర్శనం కోసం వేచి ఉండాల్సి వచ్చిందని భక్తులు వాపోతున్నారు.
ఐఐటీలో ప్లాస్మా జాతీయ సింపోజియం ప్రారంభం
ఏర్పేడు: తిరుపతి ఐఐటీలో 40వ ప్లాస్మా సైన్స్ అండ్ టెక్నాలజీ..ప్లాస్మా ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ (పీఎస్‌ఎస్‌ఐ) జాతీయ సింపోజియం శనివారం ప్రారంభమైంది. తిరుపతి ఐఐటీ ప్రాంగణంలోని లెక్చర్‌హాల్‌లో ఆ సంస్థలోని ఫిజిక్స్, సివిల్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ విభాగాల ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరగనున్న ఈ జాతీయస్థాయి సింపోజియంలోఆ సంస్థలోని ఫిజిక్స్, సివిల్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ విభాగాల ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరగనున్న ఈ జాతీయస్థాయి సింపోజియంలో ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేఎన్ సత్య నారాయణ పాల్గొని, కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. సత్యనారాయణ మాట్లాడుతూ తిరుపతి ఐసర్‌తో కలసి ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం నుంచి పర్యావరణ ఇంజినీరింగ్‌పై, ప్లాస్మా సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి అంశాలపై పలువురు శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, ఆయా రంగ ప్రముఖులు ప్రసంగించనున్నారని తెలిపారు.
తిరుపతిని ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం
తిరుపతిని ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం


