రేణిగుంట : రేణిగుంట పంచాయతీ పరిధిలోని వివేకానంద కాలనీలో నివాసం ఉంటున్న సెల్వరాజ్ కుమారుడు రాజు (24) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం రేణిగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. అప్పటికే రాజు మృతి చెందినట్లు వైద్యాధికారులు నిర్ధారించారు. రేణిగుంట అర్బన్ పోలీసులకు సమాచారం అందడంతో ట్రైనీ ఎస్‌ఐ స్వాతి సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
25న చిల్లకూరు, చిట్టేడులో పింక్‌బస్ శిబిరాలు
తిరుపతి తుడా : స్విమ్స్ ఆధ్వర్యంలో ఈనెల 25న సోమవారం చిల్లకూరు మండల కేంద్రంలోని పీహెచ్‌సీ, కోట మండలంలోని చిట్టేడు పీహెచ్‌సీలో పింక్ బస్ శిబిరాలు నిర్వహించనున్నట్లు వైద్యాధికారులు డాక్టర్ షాలోమ్ అరాఫత్, డాక్టర్ నాగరాజు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిబిరాల్లో క్యాన్సర్ వ్యాధితో పాటు బీపీ, షుగర్, పరీక్షలు ఉచితంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
వ్యక్తి ఆత్మహత్య
సత్యవేడు : మండలంలోని కొత్తమారికుప్పం పంచాయతీ గిరిజన కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్న సంపత్ కుమార్(34) రెండు రోజుల కిందట ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం ఇంటి నుంచి దుర్వాసన రావడంతో సమీప ఇళ్లలో ఉంటున్న వారు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ రామస్వామి సంఘటనా స్ధలానికి వెళ్లి మృతుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. సంపత్ కుమార్ పాలగుంటలోని కాఫ్రికాన్ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడి స్వగ్రామం కృష్ణసముద్రంగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అందజేశారు. కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
బార్ పాలసీపై
అపోహలు వద్దు
తిరుపతి క్రైమ్ : ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన బార్ పాలసీ పై అపోహలు వద్దని ప్రొహిభిషన్ అండ్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ నాగమల్లేశ్వర్‌రెడ్డి తెలిపారు. 2025–28వ సంవత్సరానికి కొత్త బార్ పాలసీని ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 29 ఓపెన్ క్యాటగిరి, మూడు రిజర్వేషన్ కేటగిరి కల్లుగీత కార్మికులకు కేటాయించిందన్నారు. ఇవీ లాటరీ విధానం ద్వారా కేటాయించినట్లు చెప్పారు. ప్రతి దరఖాస్తుదారుడు రూ.5 లక్షలు, 10,000 ప్రాసెసింగ్ ఫీజు సమర్పించాలన్నారు. నాలుగు కన్నా తక్కువ దరఖాస్తులు వస్తే ఆ బార్ లైసెనన్స్‌కు లాటరీ జరగదని తెలిపారు.