
మఠం ఆస్తుల రక్షణకు డిమాండ్
తిరుపతి కల్చరల్ : హథీరాంజీ మఠం ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా రక్షించాలని హథీరాం బావాజీ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు సీతారాం నాయక్, గౌరవాధ్యక్షుడు డీటీ నాయక్ డిమాండ్ చేశారు. శనివారం ప్రెస్‌క్లబ్‌లో వారు మాట్లాడారు. గాంధీ రోడ్డులోని హథీరాంజీ మఠం భవనం కూల్చివేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈమేరకు సమన్వయ సమావేశం నిర్వహణతో నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ వెంకటేశ్వర్ చెప్పడం శుభపరిణామమని వెల్లడించారు. గిరిజన భవన్ చైర్మన్ వెంకటరమణ నాయక్, పరిరక్షణ కమిటీ జాతీయ ప్రధాన కార్యదర్శి శివానాయక బాబురావు చౌహాన్, కృష్ణ నాయక్ పాల్గొన్నారు.