
అన్న క్యాంటీన్‌లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
వెంకటగిరి రూరల్ : రూ.5 కే పేదలకు అన్నం పెడుతున్న అన్న క్యాంటీన్‌లో అన్నం పంపిణీలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని వెంకటగిరి జూనియర్ సివిల్ జడ్జి విష్ణువర్మ పేర్కొన్నారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం సమీపం వద్ద ఉన్న అన్న క్యాంటీన్‌ను శనివారం ఆయన తనిఖీ చేశారు. రూ.5 టోకెన్ కొనుగోలు చేసి భోజనం రుచి చూశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. నాణ్యత పాటించడంలేదని ఫిర్యాదు మేరకు తనిఖీ నిర్వహించగా అన్నంలో నాణ్యత కొరవడినట్లు సూచించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాదులు రాజేష్, రాజారాం, కిషోర్ పాల్గొన్నారు.