రెండు చేతులూ పనిచేయవు | - | Sakshi
Sakshi News home page

రెండు చేతులూ పనిచేయవు

Aug 21 2025 6:36 AM | Updated on Aug 21 2025 6:36 AM

రెండు

రెండు చేతులూ పనిచేయవు

దొరవారి సత్రం మండలంలోని కుప్పరెడ్డిపాలెం ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్నా. నాకు పక్షవాతంతో రెండు చేతులు పనిచేయడం లేదు. నాకు రూ.6 వేలు పింఛన్‌ ప్రతి నెలా వస్తోంది. పేద కుటుంబానికి చెందిన వాళ్లం. అయితే ప్రస్తుతం నా పింఛన్‌ తొలగించారు. నా పరిస్థితి ఎంతో దారుణంగా ఉంది. నాకు న్యాయం చేయండి. అధికారులు మరోసారి వచ్చి పరిశీలన చేయండి.

– తిరుమల్లి పాపయ్య, దొరవారిసత్రం మండలం

తిరుపతి అర్బన్‌ : వ్యాధిగ్రస్తులు, దివ్యాంగులు, వృద్ధులు తీసుకుంటున్న పింఛన్లను తనిఖీ పేరుతో తొలగిస్తున్నారు. సెప్టెంబర్‌లో వృద్ధుల పింఛన్‌ రీవెరిఫికేషన్‌కు సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కో పింఛన్‌దారుడిది ఒక్కో ఆవేదన, ముందే పింఛన్ల డబ్బులు వైద్యం ఖర్చులకు సరిపోకపోవడంతో తిప్పలు పడుతుంటే...ఆ బాధలు చాలవంటూ పింఛన్ల తొలగింపు, మార్పుపై ఆందోళన చెందుతున్నారు. అనారోగ్యంతో బాధపడుతుంటే ఇలా ఆఫీసుల చుట్టూ తిరగమని చెప్పడం ఎంత వరకు న్యాయం అంటూ పింఛన్‌దారులు వాపోతున్నారు.

ప్రస్తుతం రూ.15 వేలు పింఛన్‌ తీసుకునే రోగులు

జిల్లాలో 1199 మంది కిడ్నీ, గుండె, లివర్‌ తదితర తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో వారికి రూ.10 వేల నుంచి రూ.15 వేల పింఛన్లు ఇస్తున్నారు. అయితే ఇటీవల పింఛన్ల రీ వెరిఫికేషన్‌ చేసిన సంగతి తెలిసిందే. రూ.15 వేలు తీసుకుంటున్న వారిలో 477 మందిని రూ.6 వేలు పింఛన్లకు , అలాగే 28 మందిని రూ. 4 వేలు పింఛన్‌కు మార్పు చేశారు. 592 మందిని మాత్రమే రూ.15 వేలకు అలానే ఉంచారు.102 మంది పింఛన్లను పూర్తిగా రద్దు చేశారు.

రూ.6 వేలు పింఛన్‌ తీసుకుంటున్న దివ్యాంగులు

ప్రస్తుతం రూ.6 వేలు తీసుకునే దివ్యాంగులు 21,570 మంది మిగిలారు. రూ. 6 వేలు పింఛన్లు తీసుకుంటున్న దివ్యాంగులు జిల్లాలో 31,069 మంది ఉన్నారు. వారిలో 21,570 మందిని అలానే ఉంచారు. 1708 మందిని రూ.4 వేలకు మార్పు చేశారు. మిగిలిన 7,791 మంది పింఛన్లు తొలగించారు.

మూగ, చెవుడు ఉన్నా

పింఛన్‌ కోత పెట్టారు..

నాకు మూగ, చముడు ఉండడంతో దివ్యాంగుల పింఛన్‌ ఇస్తున్నారు. అయితే ఇప్పుడు పింఛన్‌ తొలగించినట్లు నోటీసులు ఇచ్చారు. ఎందుకు తొలగించారో తెలియడం లేదు. పింఛన్‌ డబ్బు ప్రతి నెలా రూ.6 వేలు వస్తుంది. దాంతో మా కుటుంబం సభ్యులు నన్ను బాగా చూసుకునే వారు. సెప్టెంబర్‌ నుంచి నా జీవనం నాకే అర్థం కావడం లేదు. నాకు పింఛన్‌ ఇప్పించి , న్యాయం చేయండి.

– సోడవరం చంద్రశేఖర్‌, బాలాయపల్లి మండలం

పరిశీలన కోసం

మరో నోటీసు ఇస్తాం

దివ్యాంగులు, వివిధ వ్యాధులతో బాధపడుతున్న రోగులు పింఛన్లు తొలగిస్తున్నట్లు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో రూరల్‌ ప్రాంతంలోని వారు ఎంపీడీవో ఆఫీస్‌, అర్బన్‌ ప్రాంతంలోని వారు మున్సిపల్‌ ఆఫీస్‌లో సంప్రదించాలి. ఓ అర్జీని అధికారులకు ఇవ్వండి. పింఛన్లు తొలగించిన వారికి మరో నోటీసు ఇస్తాం. ఆ నోటీసులో తిరిగీ మళ్లీ ఆస్పత్రిలో తనిఖీ కోసం రావాల్సి ఉంటుంది. ఏ ఆస్పత్రికి రావాల్సి ఉంటుందని అనే వివరాలను త్వరలో తెలియజేస్తాం. లేదా సచివాలయంలో తెలుసుకోవచ్చు.

– వెంకటేశ్వర్‌, జిల్లా కలెక్టర్‌, తిరుపతి

రెండేళ్ల నుంచి దివ్యాంగుల పింఛన్‌ వస్తోంది

మాది వరదయ్యపాళెం మండలం, సిద్దాపురం గ్రామం. రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో కాలు విరిగింది. దాంతో దివ్యాంగుడయ్యాను. అప్పటి నుంచి దివ్యాంగుల పింఛన్‌ ఇస్తున్నారు. నాకు 65 శాతం వికలత్వం ఉంది. అయితే తాజాగా చేసిన సర్వేలో నాకు 40 శాతమే వికలత్వం ఉందని సదరం సర్టిఫికెట్‌ ఇచ్చారు. దీంతో పింఛన్‌ తొలగించారు. నాకు న్యాయం చేయా లని కోరుతున్నా. – హెచ్‌.లోకయ్య, వరదయ్యపాళెం మండలం

ఒక చెయ్యి పూర్తిగా పనిచేయదు

మాది బాలాయపల్లి మండలం కడగుంట గ్రామం. పదేళ్లుగా నాకు ఒక చెయ్యి పనిచేయడం లేదు. దీంతో దివ్యాంగుల పింఛన్‌ ఇస్తున్నారు. ఇప్పటికీ ఒక చెయ్యి పనిచేయదు. అయితే నాకు పింఛన్‌ తొలగించా రు. వచ్చే నెల నుంచి నేను ఎలా జీవనం సాగించాలో తెలియడం లేదు. ఇలా చేయడం ఎంత వరకు న్యాయమో ప్రభుత్వం ఆలోచన చేయాలి. తిరిగి నా పింఛన్‌ ఇప్పించాలని వేడుకుంటున్నా.

– కంచి పార్వతమ్మ, బాలాయపల్లి మండలం

వృద్ధుల పింఛన్లు 12,211 తగ్గింపు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెలా ఎన్టీఆర్‌ సామాజిక భద్రత పింఛన్ల కోత కొనసాగుతూనే ఉంది. గత ఏడాది జూన్‌లో 2,71,183 మందికి పింఛన్లు అందించారు. ఈ ఏడాది ఆగస్టులో 2,58,972 మందికి పింఛన్లు ఇవ్వనున్నారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తోంది. ఇప్పటి వరకు 12,211 పింఛన్లు తగ్గించారు. పింఛన్ల సంఖ్య ఎందుకు తగ్గుతున్నాయని డీఆర్‌డీఏ అధికారులను ప్రశ్నిస్తే వారంతా మృతి చెందారని సమాధానం ఇస్తున్నారు. అంటే కూటమి ప్రభుత్వం వచ్చాక 14 నెలల్లో పింఛన్లు తీసుకుంటున్న వారు 12,211 మంది మృతి చెందారా..? అంటూ అంతా చర్చించుకుంటున్నారు.

రూ.6 వేలు పింఛన్‌ రద్దయింది..

నేను ప్రతి నెలా రూ.6 వేలు పింఛన్‌ తీసుకుంటున్నా. అయితే నా పింఛన్‌ తొలగించారు. నాకు చెవుడు ఉంది. చిల్లకూరు మండలంలోని పొన్నవోలు గ్రామంలో ఉంటున్నాం. నా వయస్సు 65 ఏళ్లు, దివ్యాంగులకు ఇస్తు న్న రూ.6 వేలు పింఛన్‌ తొలగిస్తే కనీసం రూ.4 వేలు వృద్ధులకు ఇచ్చే పింఛన్‌ కూడా ఇవ్వలేదు. ఇది ఎంత వరకు న్యాయం. – తమ్మిశెట్టి వెంకటరమణయ్య,

చిల్లకూరు మండలం

పింఛన్‌తోనే జీవనం సాగిస్తున్నా..

మాది తిరుపతి రూరల్‌లోని వడ్డ్పిల్లి గ్రామం. ఏళ్ల తరబడి దివ్యాంగుల పింఛను తీసుకుంటున్నా. అయితే ఇటీవల సచివాలయ ఉద్యోగులు నోటీసు ఇచ్చారు. వచ్చే నెల నుంచి పింఛన్లు ఇవ్వడం లేదని చెప్పారు. కలెక్టరేట్‌ కార్యాలయంలోనూ న్యాయం కోసం అర్జీ ఇచ్చా. కేవలం పింఛన్‌తో జీవనం సాగిస్తున్నా. పింఛన్‌ నాకు తిరిగి ఇప్పించండి.

– ఆర్ముగం, తిరుపతి రూరల్‌

రెండు చేతులూ పనిచేయవు 
1
1/7

రెండు చేతులూ పనిచేయవు

రెండు చేతులూ పనిచేయవు 
2
2/7

రెండు చేతులూ పనిచేయవు

రెండు చేతులూ పనిచేయవు 
3
3/7

రెండు చేతులూ పనిచేయవు

రెండు చేతులూ పనిచేయవు 
4
4/7

రెండు చేతులూ పనిచేయవు

రెండు చేతులూ పనిచేయవు 
5
5/7

రెండు చేతులూ పనిచేయవు

రెండు చేతులూ పనిచేయవు 
6
6/7

రెండు చేతులూ పనిచేయవు

రెండు చేతులూ పనిచేయవు 
7
7/7

రెండు చేతులూ పనిచేయవు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement