
దోమలు లేని నగర నిర్మాణానికి కృషి
తిరుపతి తుడా : ప్రపంచ దోమల నివారణ దినోత్సవంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో దోమల నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. బుధవారం జిల్లా వైద్య శాఖ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీలో డాక్టర్ శైలజ, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ జీకే రూప్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దోమలు లేని గ్రామం, దోమలు లేని నగర నిర్మాణానికి ప్రతి వ్యక్తి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ రెడ్డి ప్రసాద్, డాక్టర్ మధు, ఆరోగ్యశాఖ అధికారులు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.