
ఉత్తమ పౌరులను తీర్చిదిద్దుటలో ఎన్‌సీసీ కీలకం
తిరుపతి సిటీ:తిరుపతి ఎన్‌సీసీ గ్రూప్ ప్రధాన కార్యాలయాన్ని ఎన్‌సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎయిర్ కమాండర్ నర్సింగ్ సైలానీ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు ఎన్‌సీసీ క్యాడెట్లు గౌరవ వందనంతో స్వాగతం పలికారు. గౌరవ వందనం అందుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ.. క్రమశిక్షణ, దేశభక్తి ప్రధానాంశాలుగా బాధ్యతాయుతమైన పౌరులను దేశానికి అందించుటలో ఎన్‌సీసీ కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. ఎన్‌సీసీ క్యాడెట్ల కు నాణ్యమైన శిక్షణ, నైపుణ్యాల బలోపేతం, సాహస కార్యక్రమాలలో పాల్గొనేలా కృషి చేయాలని పిలుపు నిచ్చారు. తిరుపతి గ్రూప్ క్యాడెట్లు జాతీయ శిబిరాలు, సాంఘిక సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొనడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో తిరుపతి గ్రూప్ కమాండర్ కల్నల్ సతీందర్ దాహియా, ఎన్‌సీసీ అధికారులు పాల్గొన్నారు.