
ఐఐటీలో ఫ్యాకల్టీ సెన్సిటైజేషన్
ఏర్పేడు : ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీలో బుధవారం ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కేఎన్ సత్యనారాయణ ఆధ్వర్యంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సహకారంతో హాఫ్–డే ఫ్యాకల్టీ సెన్సిటైజేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం అధ్యాపకులు, పరిశోధనా పండితులు, విద్యార్థులలో ప్రామాణీకరణ కీలక పాత్ర, ప్రస్తుతం అందుబాటులో ఉన్న సహకార అవకాశాల గురించి అవగాహన కల్పించారు. ఐఐటీ డైరెక్టర్ మాట్లాడుతూ.. సివిల్ ఇంజినీరింగ్ అధ్యయనాల సమయంలో భారతీయ ప్రమాణాలను ఉపయోగించడంలో తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్నారు. అధ్యాపకులు, విద్యార్థులు ప్రామాణీకరణ పర్యావరణ వ్యవస్థకు తోడ్పడాలన్నారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్‌తో ఐఐటీ డైరెక్టర్ కేఎన్ సత్యనారాయణ, శాస్త్రవేత్త, డైరెక్టర్ చిన్మయ్ ద్వివేదితో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీధర్ చిమలకొండ, నేహా యాదవ్, ధరమ్‌సోత్ సంతోష్ పాల్గొన్నారు.