
ఆకాష్‌లో స్కాలర్‌షిప్ పరీక్ష
తిరుపతి సిటీ : స్థానిక ఎయిర్ పాస్ రోడ్డులోని ఆకాష్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఆంథే–2025 పేరుతో విద్యార్థులకు స్కాలర్ షిప్ పరీక్ష నిర్వహించనున్నట్లు స్టేట్ అకడమిక్ ఆపరేషన్ హెడ్ ఆర్‌వీఎస్‌ఎన్ మూర్తి తెలిపారు. బుధవారం ఆకాష్ సంస్థలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు, మెరిట్ విద్యార్థులు తమ ప్రతిభను నిరూపించుకుని రూ.కోట్లలో స్కాలర్ షిప్‌లు పొందుతూ సంస్థలో ఐఐటీ, జేఈఈ, నీట్ పరీక్షలకు ఉచిత కోచింగ్ పొందేందుకు సంస్థ అవకాశం కల్పించిందన్నారు. ఆన్‌లైన్‌లో అక్టోబర్ 4వతేదీ నుంచి 12 వరకు, ఆఫ్‌లైన్ ద్వారా అక్టోబర్ 5వ, 12వ తేదీలలో పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు.
విద్యార్థులకు కేవలం రూ.150తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి విద్యార్థికి రూ.5వేల విలువగల ఆన్‌లైన్ స్టడీమెటీరియల్ అందిస్తామని తెలిపారు. సమావేశంలో రీజనల్ సేల్స్ హెడ్ నిశాంత్ మిశ్రా, సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ సీహెచ్ విజయ్ కుమార్, రీజినల్ మార్కెటింగ్ హెడ్ నరసింహులు, బ్రాంచ్ మేనేజర్ సుబ్రమణ్యం పాల్గొని ఆంథే స్కాలర్ షిప్‌కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు.
రైలు ఢీకొని టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగి మృతి
పుత్తూరు: స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో మంగళవారం రాత్రి రైలు ఢీకొని ఎం.శ్రావణ్‌కుమార్(31) అనే యువకుడు మృతి చెందాడు. స్థానిక లక్ష్మీనగర్ కాలనీలో నివాసము న్న శ్రావణ్‌కుమార్ నాగలాపురంలోని వేదనారా యణస్వామి ఆలయంలో నాదస్వర విద్వాన్‌గా కాంట్రాక్ట్ బేసిక్‌పై పనిచేస్తున్నాడు. బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రైల్వే పోలీసులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.