
ఏడాదిలోనే 99 శాతం సూపర్ సిక్స్ హామీలు పూర్తి
తిరుపతి అర్బన్: అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే కూటమి సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన సూపర్‌సిక్స్ పథకాలను 99 శాతం అమలు చేసిందని దేవాదాయశాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన తిరుపతి బస్టాండ్ వద్ద సీ్త్రశక్తి పథకంలో భాగంగా ఉచిత బస్సు జిల్లా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మొదటి టికెట్‌ను తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ నారపురెడ్డి మౌర్యకు కండక్టర్ నుంచి ఇప్పించారు. ఆ తర్వాత రెండో టికెట్ కలెక్టర్ వెంకటేశ్వర్ చేతుల మీదుగా మరో మహిళకు అందించారు. స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్‌తోపాటు తుడా చైర్మన్ దివాకర్‌రెడ్డి పలువురు పార్టీ నేతలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ రఘు, ఆర్టీసీ డీపీటీఓ జగదీష్, డిప్యూటీ సీటీఎం విశ్వనాథం, డిప్యూటీ మెకానిక్ ఇంజినీర్ బాలాజీ తదితరులు తదితరులు పాల్గొన్నారు.
వివాహ పరిచయ వేదిక రేపు
తిరుపతి కల్చరల్: రాయల్ బలిజ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 17వ తేదీ ఉదయం 8 గంటలకు గాంధీరోడ్డులోని ఏజీకే బిల్డింగ్‌లో పద్మావతి వివాహ పరిచయ వేదిక నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు సుబ్రమణ్యం తెలిపారు. శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బలిజ కులానికి చెందిన అమ్మాయిలు, అబ్బాయిలు వారి తల్లిదండ్రులు పాల్గొని, తమ పిల్లలకు తగిన సంబంధాలను కుదుర్చుకునేందుకు ఈ వివాహ పరిచయ వేదిక చక్కటి వేదికగా దోహదపడుతుందని తెలిపారు. ఇందులో పాల్గొనే వారి తల్లిదండ్రులు పెళ్లి కుమారుడు, కుమార్తె పోస్ట్ కార్డు సైజు ఫొటోలు, బయోడేటాను తీసుకుని రావాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన బలిజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 8712233082లో సంప్రదించాలని తెలిపారు. ఈ సమావేశంలో బలిజ సంఘ నేతలు గుట్టా నాగరాజ రాయల్, సుబ్బరామయ్య, ఏవీ.ప్రతాప్, మనోజ్, దిలీప్, సాయిప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
మూడు హోటళ్లు సీజ్
చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలో స్వాతంత్య్ర దినోత్సవ నిబంధనలు ఉల్లంఘించి మాంసాహార భోజనాలు విక్రయిస్తున్న హోటల్‌ను అధికారులు సీజ్ చేశారు. శుక్రవారం నగరంలోని పలమనేర్ రోడ్డు లోని హోటల్ తో పాటు మరో రెండు హోటళ్లలో మాంసాహారం విక్రయిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్‌కు ఫిర్యాదులు అందాయి. కమిషనర్ ఆదేశాలతో ప్రజారోగ్య శాఖ అధికారులు నగరంలోని మూడు హోటళ్లను సీజ్ చేశారు.