
ఎమ్మెల్సీ మేరిగకు పరామర్శ
రాపూరు: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్‌ను పలువురు పరామర్శించారు. మురళీధర్ తండ్రి మేరిగ ఆనందరావు (89) గురువారం మృతి చెందిన విషయం తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆనందరావు చికిత్స పొందుతూ మృతి చెందాడు. రాపూరులోని లక్ష్మీపురంలోని ఆయన నివాసంలో ఆనందరావు భౌతిక కాయాన్ని సందర్శించిన పలువురు నాయకులు మేరిగ మురళీధర్‌ను పలకరించి, సంతాపం తెలిపారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి, వైఎస్సార్‌సీపీ జోన్–4 వర్కింగ్ ప్రెసిడెండెంట్ కాకాణి పూజితమ్మ, వైఎస్సార్‌సీపీ నాయకులు బత్తిన పట్టాభిరామిరెడ్డి, పాపకన్ను మధుసూదన్‌రెడ్డి, మండల కన్వీనర్ బోడ్డు మధుసూదన్‌రెడ్డి, దందోలు నారాయణరెడ్డి, మస్తాన్‌యాదవ్, వైఎస్సార్‌సీపీ నాయకులు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి తదితరులు శుక్రవారం ఆనందరావు భౌతిక కాయానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం మేరిగ మురళీధర్‌ను పరామర్శించి, తమ ప్రగాఢ సంతాపం తెలిపారు.

ఎమ్మెల్సీ మేరిగకు పరామర్శ