అదుపుతప్పి లారీ బోల్తా | - | Sakshi
Sakshi News home page

అదుపుతప్పి లారీ బోల్తా

Aug 16 2025 8:37 AM | Updated on Aug 16 2025 8:37 AM

అదుపుతప్పి లారీ బోల్తా

అదుపుతప్పి లారీ బోల్తా

నాయుడుపేటటౌన్‌: మండలంలోని తన్నమాల సమీపంలో రహదారిపై శుక్రవారం ధాన్యం లోడ్‌తో వెళుతున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. స్థానికుల కథనం మేరకు.. తన్నమాల గ్రామ పరిసర ప్రాంతాల్లో ధాన్యం సేకరించుకుని బస్తాలు నింపుకున్న లారీ నాయుడుపేటకు బయలు దేరింది. తన్నమాల సమీపంలో ఓ మలుపు వద్ద వేగంగా వస్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. లారీ డ్రైవర్‌ మద్యం సేవించి ఉండడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. లారీ డ్రైవర్‌ అక్కడ నుంచి పరారయ్యాడు .ధాన్యం బస్తాలను మరో వాహనంలో తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement