
రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
చంద్రగిరి/పాకాల : ప్రయాణిస్తున్న రైలు నుంచి జారి పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన పాకాల రైల్వే స్టేషన్ నుంచి ముంగిళిపట్టు రైల్వే స్టేషన్ మధ్యలో సోమవారం వెలుగుచూసింది. స్థానిక రైల్వే పోలీసుల కథనం మేరకు, సుమారు 45 ఏళ్ల వ్యక్తి ఉదయం 10 గంటల సమయంలో గుర్తు తెలియని రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. మృతుడి చేతిపై దేవి అను పేరు పచ్చబొట్టు ఉందని, అతని జేబులో పాకాల–నేండ్రగుంట ఆర్టీసీ బస్ టికెట్ ఉందని తెలిపారు. మృతుని వివరాలు తెలిసిన వారు చిత్తూరు ఇన్‌చార్జ్ రైల్వే ఎస్‌ఐ రత్నమాల సెల్ 94926 29311 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
కార్మిక శాఖతో ఎస్వీయూ ఒప్పందం
తిరుపతి సిటీ: రాష్ట్ర ప్రభుత్వ కార్మికశాఖతో ఎస్వీయూ పలు అంశాలపై పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు అమరావతిలో సోమవారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ , కమిషనర్ శేషగిరి బాబును ఎస్వీయూ వీసీ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతినాయుడు కలిసి ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం వీసీ మాట్లాడుతూ కార్మిక శాఖ ఆధ్వర్యంలో వర్సిటీలో భద్రతా తర్ఫీదు కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని తెలిపారు. ఇందులో వివిధ పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగుల భద్రత నైపుణ్యాలు పెంపొందించడానికి ఈ కేంద్రంలో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
అక్రమ మట్టి తవ్వకాలపై పోలీసుల దాడి
రేణిగుంట:మండలంలోని అత్తూరు పంచాయతీ మొలగమూడి చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారనే సమాచారంతో సోమవారం గాజులమండ్యం ఎస్‌ఐ సుధాకర్ తమ సిబ్బందితో దాడులు నిర్వహించి జేసీబీ 3 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. అక్రమ తవ్వకాలు, రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి