
ఎస్వీ వైద్య కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం
తిరుపతి తుడా : ఎస్వీ వైద్య కళాశాలలో నీట్–2025 తొలి విడత ఎంబీబీఎస్ ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు గురువారం ఉత్తమ ర్యాంక్ సాధించిన తిరుపతికి చెందిన గుణ భూషణ్‌కు ప్రిన్సిపల్ డాక్టర్ రవిప్రభు తొలి అడ్మిషన్ ధ్రువపత్రాన్ని అందించారు.
ఉత్తమ టీచర్ల ఎంపికకు
ఇంటర్వ్యూలు
తిరుపతి సిటీ : జిల్లాలో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక కోసం ఇంటర్వ్యూలు గురువారం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో నిర్వహించారు. సెప్టెంబర్ 5వ తేదీ టీచర్స్‌డే సందర్భంగా విజయవాడ కేంద్రంగా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులను అందించనున్నారు. ఇందులో భాగంగా జిల్లా నుంచి 41 మంది ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు అందాయి. డీఈఓ కేవీఎన్ కుమార్ ఆధ్వర్యంలోని కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించి ఇద్దరు ప్రధానోపాధ్యాయులు, నలుగురు స్కూల్ అసిస్టెంట్లు, ఇద్దరు సెకండరీ గ్రేడ్ టీచర్లను మొత్తం ఎనిమిది మందిని ఎంపిక చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపనుంది. ఇందులో నుంచి నలుగురుని ఉత్తమ ఉపాధ్యాయులుగా ప్రభుత్వం ఎంపిక చేసి సెప్టెంబర్ 5న అవార్డులను అందించనుంది.
రాష్ట్రస్థాయి జూడో పోటీల్లో విద్యార్థినికి పతకం
ఏర్పేడు : ఈనెల 8, 9వ తేదీలలో గుంటూరు జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి జూడో పోటీలలో ఉమ్మడి చిత్తూరు జిల్లా జూడో జట్టుకు ప్రతినిధ్యం వహించిన ఏర్పేడు మండలం పాపానాయుడుపేట జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని యామిని 40 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించినట్లు హెచ్‌ఎం మారయ్య తెలిపారు. జూడో పోటీలలో ప్రతిభ కనబరిచిన ఆమెను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.

ఎస్వీ వైద్య కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం

ఎస్వీ వైద్య కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం