
దొరవారిసత్రం: స్నేహితులతో కలిసి వాటర్ ఫాల్స్‌కు వెళుతూ ముందు వెళుతున్న లారీని అదుపుతప్పి బైక్ ఢీకొంది. ఈ సంఘటనలో బైక్‌పై ప్రయాణించే ఎల్లంపాటి భవానిప్రసాద్(22), ముడునూరు గణేష్(17) అక్కడిక్కడే మృతి చెందారు. మరో యువకుడు బట్టా అనిల్(20) గాయాలతో బయట పడ్డారు. ఈ ఘటన ఆదివారం పోలిరెడ్డిపాళెం సమీపంలోని జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు..
నాయుడుపేట మండలం పుదూరు గ్రామానికి చెందిన బాలకృష్ణ, విజయమ్మ దంపతుల కుమారుడు భవానిప్రసాద్, అదే గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, సుబ్బమ్మ దంపతుల సంతానం గణేష్, మరో యువకుడు అనిల్‌తో కలిసి బైక్‌పై వరదయపాళెం మండలం ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్‌కు బయలుదేరారు. దొరవారిసత్రం మండలం పోలిరెడ్డిపాళెం సమీపంలోని భారత్ పెట్రోల్ బంకు వద్ద బైక్ అదుపు తప్పి ముందు వెళుతున్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ బోల్తా పడి భవానిప్రసాద్, గణేష్ అక్కడిక్కడే మృతి చెందారు. అదే బైక్‌పై ఉన్న అనిల్ తీవ్ర గాయాలతో బయట పడగా టోల్ ప్లాజా అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో యువకులు మృతి చెందడంతో పుదూరు గ్రామంలోని రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. వెంకటేశ్వర్లు, సుబ్బమ్మ దంపతులకు గణేష్ ఏకై క సంతానం కావడంతో వారి వేదన వర్ణనాతీతంగా మారింది. భవానిప్రసాద్ చైన్నెలోని ఓప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజ్‌లో బీటెక్ ద్వితీయ సంవత్సరం, గణేష్ కూడా చైన్నెలోని మరో ఇంజినీరింగ్ కాలేజ్‌లో ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి