రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
తిరుపతి క్రైమ్ : తిరుపతిలోని గరుడ వారధిపై శుక్రవారం జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. వివరాలు.. చంద్రగిరి మండలం రంగంపేటకు చెందిన నాగేంద్ర(30) బైక్‌పై తిరుచానూరు నుంచి తిరుపతికి గరుడ వారధిపై వెళుతూ అదుపుతప్పి రైలింగ్ ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో నాగేంద్ర అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు.
ఇద్దరికి గాయాలు
తిరుపతి రూరల్ : పూతలపుట్టు– నాయుడుపేట జాతీయ రహదారిపై తిరుపతి రూరల్ మండలం రామానుజపల్లె చెక్ పోస్టు సమీపంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట నుంచి తిరుపతికి టమాటాలు తీసుకుని వస్తున్న లగేజీ ఆటోను వెనుక నుంచి వచ్చిన టయోటా వాహనం ఢీకొంది. దీంతో టమాటా వాహనం రహదారి పక్కన గోతిలో పడింది. డ్రైవర్ రాజు, వెనుక కూర్చున్న కూలీ అంబికకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. ప్రమాదానికి కారణమైన టయోటా వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంబిక తల్లి వెంకటమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేరకు తిరుపతి రూరల్ ఎస్‌ఐ షేక్షావలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన అంబిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి


