బాలుడి మృతి కేసులో ముగ్గురి అరెస్టు
సత్యవేడులో బాలుడు వెంకటేష్ మృతి కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు.
– 10లో
మాకు అన్యాయం
గత వైఎస్సార్‌సీపీ ప్రభు త్వం యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో సుమారు 10 వేల ఎండీయూ వాహనాలను రాయితీలతో పేదలకు అప్పగించారు. తిరు పతి జిల్లాకు సైతం 369 మందికి వాహనాలు వచ్చాయి. క్రమం తప్పకుండా బియ్యం పంపిణీ చేస్తున్నాం. అయితే కూటమి సర్కారు వాటిని రద్దు చేయడంతో మేమంతా వీధినపడాల్సి వస్తుంది. న్యాయం కోసం పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం. మాకు ప్రత్యామ్నాయం కల్పించాల్సిందే. – కే.కిషోర్‌కుమార్, ఎండీయూ
వాహనాల అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు
వరదల సమయంలో
విజయవాడకు వెళ్లాం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడలో భారీ వరదలు వచ్చినప్పుడు రాష్ట్రంలోని అన్ని ఎండీయూ వాహనాలను పిలిచారు. మేమంతా వెళ్లాం. కొందరు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యాన్ని అందించాం. అయినా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మా సేవలు గుర్తుకురాలేదు. ఎంతో బాధగా ఉంది. ప్రభుత్వాలు పది మందికి ఉపయోగపడేలా చట్టాలు చేయాలి. అంతేతప్ప పది మందికి నష్టాలు చేయడానికి చట్టాలు చేయడం సరికాదు.
– కే.మొహిద్దీన్,ఎండీయూ ఆపరేటర్,
చిల్లకూరు మండలం
బాలుడి మృతి కేసులో ముగ్గురి అరెస్టు


