దుకాణాల కూల్చివేతపై ధర్నా
బొంతాలమ్మ గుడి వద్ద వీధి వ్యాపారుల షాపుల7 కూల్చివేతపై బుధవారం ఏఐటీయూసీ నేతలు ధర్నాకు దిగారు.
‘అమృత్’ స్టేషన్..
అభినందనీయం
సూళ్లూరుపేట : అమృత్ స్టేషన్ పథకం కింద సూళ్లూరుపేట రైల్వేస్టేషన్‌ను అత్యాధునిక వసతులతో అభివృద్ధి చేయడం అభినందనీయమని ఎంపీ గురుమూర్తి తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ అద్భుతంగా తీర్చిదిద్దిన రైల్వేస్టేషన్‌ను గురువారం రాత్రి వర్చువల్ విధానంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమానికి తనను ఆహ్వానించినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పలుమార్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రిని కలిసి సూళ్లూరుపేట రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేయాలని విన్నవించినట్లు వెల్లడించారు. షార్‌తోపాటు శ్రీసిటీ, మాంబట్టు, మేనకూరు సెజ్‌లో వివిధ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది పనిచేస్తున్నారని, సూళ్లూరుపేట రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేస్తే అందరికీ సౌకర్యంగా ఉంటుందని కోరినట్లు వివరించారు. తమ విన్నపాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించి అమృత్ స్టేషన్ పథకం కింద ఆధునికీకరించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ క్రమంలోనే ఉత్తర భారతదేశానికి వెళేఓల ఎక్స్‌ప్రెస్ రైళ్లకు సైతం సూళ్లూరుపేటలో స్టాపింగ్ ఇవ్వాలని ఎంపీ గురుమూర్తి కోరారు.
– 8లో
దుకాణాల కూల్చివేతపై ధర్నా


