మీ కోసమే ‘స్విమ్స్ సేవ’
తిరుపతి తుడా: స్విమ్స్ ఆస్పత్రిలో రోగులు, వారి సహాయకులకు త్వరితగతిన సేవలందించాలనే ఉద్దేశంతో ‘స్విమ్స్ సేవ’ను ప్రారంభించినట్లు డైరెక్టర్, వీసీ డాక్టర్ ఆర్వీ కుమార్ తెలిపారు. రోగుల సౌకర్యర్థం స్విమ్స్‌లో విద్యానభ్యసిస్తున్న విద్యార్థులను ఒక బ్యాచ్‌కు 20 మందిని నియమించి సోమవారం నుంచి స్విమ్స్ సేవలను ప్రారంభించినట్టు తెలిపారు. ఆయన మాట్లాడుతూ టీటీడీలో కొనసాగుతున్న శ్రీవారి సేవ మాదిరిగానే స్విమ్స్‌లో కూడా స్విమ్స్ సేవ ప్రారంభించాలని స్విమ్స్ ఎక్స్పర్ట్ కమిటీ సూచించినట్టు పేర్కొన్నారు. ఆస్పత్రిలో దాదాపు 42 విభాగలకు చెందిన వైద్య సేవలకు గాను వివిధ ప్రాంతాల నుంచి రోజుకు దాదా పు 1,500 మంది రోగులు వస్తున్నారని, వీరిలో చాలామంది గ్రామీణ ప్రాంతాల వారు కావడంతో వీరికి ఎక్కడ ఏయే వైద్య సేవలందుతున్నాయో తెలియడం లేదన్నారు. అందుకోసం వారిని స్విమ్స్ ఓపీడీ బ్లాక్, శ్రీ పద్మావతి ఏపీడీ బ్లాక్ వద్ద రోగులు ఏపీ రిజిస్ట్రేషన్, రక్త పరీక్షలు, ఇతర వైద్య పరీక్షల కోసం ఈ సేవను ప్రారంభించినట్టు తెలిపారు. మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, కాలేజ్ ఫిజియోథెరపీ ప్రిన్సిపల్ డాక్టర్ మాధవి, చీఫ్ మెడికల్ రికార్డ్స్ ఆఫీసర్ వివేకానంద్, మురళి, శిరీషా పాల్గొన్నారు


