రోజుకు రూ.8 కోట్లపైనే వ్యాపారం
జిల్లా సమాచారం
ప్రైవేటు ఆసుపత్రులు 1245
మెడికల్ షాపులు 2089
ప్రభుత్వాసుపత్రుల్లో రోజుకు
మందుల ఖర్చు రూ.4 కోట్లు
ప్రైవేటు మెడికల్ షాపుల్లో రోజుకు
జరుగుతున్న వ్యాపారం రూ.8 కోట్లు
జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలోని ప్రధాన పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలలోనూ ఇబ్బడి ముబ్బడిగా మెడికల్ షాపులు ఏర్పాటు చేశారు. ప్రజల అనారోగ్య పరిస్థితులను ఆసరాగా చేసుకుని ప్రభుత్వ అనుమతి లేని కంపెనీలకు చెందిన మందులు, మాత్రలను విక్రయిస్తూ రోజుకు సుమారు రూ. 8 కోట్లకు పైగా దండుకుంటున్నారు. మెడికల్ షాపులో పనిచేసే ఫార్మసీ ఉద్యోగులే డాక్టర్లుగా పలానా జబ్బుకు ఈ మందులు వాడితే సరిపోతుందంటూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. డాక్టర్‌ను సంప్రదించే శక్తిలేక మందులషాపుల వారు ఇచ్చే మాత్రలు విచ్చలవిడిగా తీసుకుంటూ అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు.


