గంగమ్మా.. కరుణించమ్మా
● గంగమ్మకు సారె సమర్పించిన భూమన
తిరుపతి కల్చరల్: తిరుపతి గ్రామదేవత శ్రీతాతయ్యగుంట గంగమ్మకు టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్‌ఆర్‌సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి గురువారం సంప్రదాయబద్ధంగా సారె సమర్పించారు. అమ్మవారి ఆలయ మహద్వారం నుంచి పసుపు, కుంకుమ, గాజులు, చీర, రవిక పూలమాలలతో కూడిన సారెను నెత్తిన పెట్టుకొని పార్టీ నేతలతో కలిసి ఆయల ప్రదక్షిణ చేసి అమ్మవారికి సారెను సమర్పించారు. గంగమ్మ తల్లిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ తిరుపతి నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు వంశీ, టౌన్ బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్రారెడ్డి, గంగమ్మ ఆలయ మాజీ చైర్మన్ కట్టా గోపీయాదవ్, గ్రీన్‌సెల్ అధ్యక్షుడు మద్దాలి శేఖర్ రాయల్, పార్టీ సీనియర్ నేతలు తొండమనాటి వెంకటేశ్వర్‌రెడ్డి, తులసీ యాదవ్, నీలం బాలాజీ, అజయ్‌కుమార్ పాల్గొన్నారు.


