ఉద్యోగుల సంక్షేమం ప్రభుత్వ బాధ్యత
శ్రీకాళహస్తి: ఉద్యోగుల సంక్షేమం ప్రభుత్వ బాధ్యత అని ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ఇన్‌చార్జి ఆదినారాయణరెడ్డి తెలిపారు. పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం తిరుపతి జిల్లా శాఖ ప్రథమ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యాయవాణి సంపాదకులు గాజుల నాగేశ్వరరావు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు గంటా మోహన్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ప్రాథమిక విద్యావ్యవస్థ పటిష్టంగా ఉండాలని చెప్పారు. అందుకు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను కొనసాగించాలని చెప్పారు. ఉన్నత పాఠశాలల్లో 3, 4, 5 తరగతులను తొలగించమంటే 1, 2 తరగతులను నేడు విలీనం చేస్తున్నారని మండిపడ్డారు. దీని వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని సూచించారు. రమేష్‌బాబు, జగన్నాథం, కఠారి మోహన్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, గురుప్రసాద్, యువశ్రీ మురళి, రామాంజనేయులు, రేణుకాదేవి, శారదమ్మ, హరికృష్ణ, గుమ్మడి మురళి పాల్గొన్నారు.


