● స్వర్ణముఖి నదిలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు ● శ్రీకా
రేణిగుంట/ శ్రీకాళహస్తి : టీడీపీ నేతల ధనదాహానికి స్వర్ణముఖి నది కుదేలవుతోంది. ఇసుకాసురుల చెరలో చిక్కి శల్యమవుతోంది. ఈ క్రమంలోనే ఆదివారం శ్రీకాళహస్తి మండలం సుబ్బానాయుడు కండ్రిగ, ఏర్పేడు మండలం ముసలిపేడు పరిసరాల్లో ఫ్‌లై ఓవర్ వంతెన కింద స్వర్ణముఖి నదిలో తెల్లవారుజాము నుంచే జేసీబీలతో ఇసుకను తోడి ట్రాక్టర్లలో తరలించారు. టీడీపీ ముఖ్యనేత ఆదేశాలతోనే స్థానిక నేతలు ఇసుకను తోడేస్తున్నట్లు గ్రామస్తులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై స్థానికులు కొందరు ఫిర్యాదు చేయడంతో శ్రీకాళహస్తి, ఏర్పేడు తహసీల్దార్లు అది తమ పరిది కాదని కాలయాపన చేశారు. అధికారులకు ఫిర్యాదు చేసినా ఇసుక అక్రమ రవాణా మాత్రం నిరాటంకంగా కొనసాగడం గమనార్హం.
రెచ్చిపోతున్న పచ్చతోడేళ్లు
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కొంతకాలంగా తొట్టంబేడు మండలం పెన్నలపాడు, విరూపాక్షిపురంలో ఇసుక తరలించేవారు. అక్కడి ప్రజలు అడ్డుకోవడంతో అక్రమార్కులు ముసలిపేడు, సుబ్బానాయుడుకండ్రిగపై దృష్టి సారించారు. స్థానికులు ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారులు స్పందించడం లేదు. శ్రీకాళహస్తి రూరల్, ఏర్పేడు పోలీసులు అయితే ఆదివారం ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఇసుక తవ్వకాల వీడియోలు వైరల్ అవుతున్నా కన్నెత్తి చూడక పోవడం విమర్శలకు తావిస్తోంది.
● స్వర్ణముఖి నదిలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు ● శ్రీకా


