తిరుమల: శ్రీవారిని మంగళవారం సిని మా డైరెక్టర్ నాగవంశీ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయాధికారులు ప్రత్యేక దర్శ నం ఏర్పాట్లు చేశా రు. శ్రీవారి దర్శనా నంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా.. టీటీడీ అధికారులు లడ్డు ప్రసాదాలతో సత్కరించారు.
140 టన్నుల క్వార్జ్ సీజ్
సైదాపురం: మండల కేంద్రమైన సైదాపురానికి కూత వేటు దూరంలోని పలు ప్రాంతాల్లో శ్రీపొట్టి శ్రీరాముల నెల్లూరు జిల్లా మైనింగ్ అధికారులు దాడులు చేశారు. అక్రమంగా అనుమతి లేకుండా ఉన్న 140 టన్నుల క్వార్జ్ సీజ్ చేసి, వీఆర్వోకు అప్పగించారు.
మార్గ వివాదం..
ప్రయాణికుడికి కష్టం
తిరుపతి అర్బన్: తిరుపతి నుంచి కాణిపాకం ఆలయానికి రోజుకు 24 ట్రిప్పులు తిరగాల్సిన హైర్ బస్సులు(ఆర్టీసీ అద్దె బస్సులు)మంగళవారం కేవలం 6 ట్రిప్పులు మాత్రమే తిరిగాయి. 18 ట్రిప్పులు రూట్ వివాదంతో నిలుపుదల చేశారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కాణిపాకం గ్రామానికి బస్సులు కరువయ్యాయి. దీంతో ప్రయాణికులు బస్టాండ్‌లో పడిగాపులు కా యాల్సిన దుస్థితి నెలకొంది. చిన్నపిల్లలు, వృద్ధుఽలు, మహిళలు ఇక్కట్లు పడ్డారు. ఆ త ర్వాత బస్సు వచ్చినా సీట్లు లేక నిలబడి ప్ర యాణించాల్సి వచ్చింది. కాణిపాకం జర్నీ భలే కష్టం గురూ అంటూ అంతా ఆవేదన వ్యక్తం చేశారు.
హైర్ బస్సుల రూట్ వివాదం
తిరుపతి నుంచి కాణిపాకం గ్రామానికి 14 సర్వీసులు నడుస్తున్నాయి. అందులో 8 సర్వీసులు హైర్ బస్సులు(ఆర్టీసీ అద్దెబస్సులు) ఉన్నా యి. టజట బస్టాండ్ నుంచి గరుడవారధి కింది మార్గంలోనే కపిలతీర్థం, అలిపిరి మీదుగా కాణిపాకం పోవాలని తిరుపతి డీఎం బాలాజీ స్పష్టం చేశారు. అందుకు అద్దె బస్సుల డ్రైవర్లు బస్టాండ్ నుంచి వారధిపైన అయితేనే వెళతామని, లేదంటే వెళ్లమని భీష్మించారు. ఉదయం 10.30 నుంచి పూర్తిగా అద్దె బస్సులను కాణిపాకం వెళ్లకుండా నిలుపుదల చేశారు.
శ్రీవారి సేవలో నాగ వంశీ


