చిల్లకూరు: గూడూరు రెండో పట్టణ పరిధిలోని వాణిజ్య పన్నులశాఖ కార్యాలయంలో పనిచేసే అధికారి ఏసురత్నం అస్వస్థతకు గురైన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ మేరకు ఆయన గూడూరు ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకుని అక్కడకు వెళ్లి విచారించే ప్రయత్నం చేయగా ఆయన పొంతన లేని విషయాలు చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. కార్యాలయానికి వచ్చిన ఆయన ఒక గంట తర్వాత అపస్మారక స్థితికి చేరినట్టు సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఆయనకు నిద్ర మాత్రలు మింగే అలవాటు ఉందని, అందువల్ల పడిపోయి ఉంటాడని అంటున్నారు. కానీ పని ఒత్తిడి కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉండొచ్చని క్రింది స్థాయి సిబ్బంది చెబుతుండడం గమనార్హం. దీనిపై పోలీసులకు ఎలాంటి సమాచారం లేదు.
కార్యదర్శులకు కౌన్సెలింగ్
చిత్తూరు కార్పొరేషన్: ఉమ్మడి జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులకు బదిలీలపై సోమవారం కౌన్సెల్సింగ్ నిర్వహించారు. జెడ్పీ సమావేశ మందిరంలో సీఈఓ రవికుమార్‌నాయుడు, డీపీఓ సుధాకర్‌రావు ప్రక్రియను నిర్వహించారు. గ్రేడ్ 5 నుంచి గ్రేడ్ 4కు పదోన్నతి పొందిన పంచాయతీ కార్యదర్శులు ఆప్షన్ పెట్టుకున్నారు. మొత్తం 83 మంది బదిలీలకు అర్హత సాధించగా అందులో 77 మంది వారు కోరుకున్న స్థానాలను తెలియజేశారు. సంబంధిత పత్రాలను అధికారులు పరిశీలించారు. ఈ నివేదికను ఆమోదం కోసం కలెక్టర్‌కు పంపుతామన్నారు. ప్రక్రియ పూర్తయిన తర్వాత తదుపరి ఉద్యోగుల ఉద్యోగోన్నతి, బదిలీ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఖాళీల భర్తీలను ప్రభుత్వ ఆమోదంతో ఉద్యోగోన్నతి ద్వారా చేపడతామన్నారు.
వాణిజ్య పన్నుల శాఖాధికారికి అస్వస్థత!


