రాపూరు: మండలంలోని కండలేరు జలాశయం నుంచి సోమవారం చైన్నెకి నీటిని విడుదల చేసినట్టు ఈఈ విజయకుమార్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు కండలేరు హెడ్ రెగ్యులేటర్ వద్ద ఉన్న పవర్‌ప్లాంట్ యూనిట్ నుంచి నీటిని విడుదల చేశారు. ముందుగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వీచ్ ఆన్‌చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తిరుపతి, నెల్లూరు జిల్లా ప్రజలకు, రైతులకు తాగు, సాగు నీటి అవసరాల నిమిత్తం 830 క్యూసెక్కులు అందిస్తామన్నారు. అలాగే చైన్నె నగర వాసులకు సోమవారం మొదటగా 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్టు వెల్లడించారు. ప్రస్తుతం కండలేరు జలాశయంలో 49.623 టీఎంసీల నీరు ఉందన్నారు. డీఈ విజయరామిరెడ్డి, ఏఈ తిరుమలయ్య, అనిల్‌కుమార్ పాల్గొన్నారు.
పని ఒత్తిడి తగ్గించండి
తిరుపతి అర్బన్: పని ఒత్తిడి తగ్గించాలంటూ సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్లు సోమవారం జిల్లా పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారి రామ్మోహన్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. అలాగే జిల్లా పంచాయతీ అధికారి సుశీలాదేవికి కూడా విన్నవించారు.
ఉపాధి పనుల్లో..
సౌకర్యాలు కల్పించండి
తిరుపతి అర్బన్: ఉపాధి హామీ పనుల్లో కూలీలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ సిబ్బందిని ఆదేశించారు. సోమవా రం ఆయన మాట్లాడుతూ ఉప్ణోగ్రతలు ఎక్కువ గా ఉన్న నేపథ్యంలో ఉదయమే పనులు ప్రారంభించి 11 గంటలకల్లా పూర్తి చేయాలని సూచించారు. నీడ కోసం, తాగునీటి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందించడం, మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచడం లాంటివి చేయాలని చెప్పారు. 60 ఏళ్లు పైబడిన వారు మధ్యాహ్నం 12 గంటలపైన ఇంటికే పరిమితం కావడం ఉత్తమమన్నారు.
చైన్నెకి కండలేరు జలాలు


