స్వచ్ఛమైన గాలి.. పరిశుభ్రమైన నీరు.. పచ్చటి అడవి.. శ్రవణ
దిగువ శీతాలంలో జలపాతం
తంతి పందిల్ వద్ద ఫారెస్ట్ చెక్‌పోస్ట్
వరదయ్యపాళెం: కాంబాకం రిజర్వు ఫారెస్టులో ఉబ్బలమడుగు పర్యాటక కేంద్రంగా సందర్శకులను ఆకట్టుకుంటోంది. వరదయ్యపాళానికి 10 కిలో మీటర్లు దూరంలో ఒకరోజు విహారయాత్రకు ఇది చక్కటి ప్రదేశం.
చూడాల్సిన ప్రాంతాలు
వరదయ్యపాళెం నుంచి 7కి.మీ ప్రయాణిస్తే అవంతి ఫ్యాక్టరీ వస్తుంది. దీన్ని దాటితే రిజర్వు ఫారెస్టు మొదలవుతుంది. అడవి మొదట్లో తెలుగుగంగ కాలువ, టోల్ గేట్ ఉంది. ఈ ప్రాంతం నుంచి సూమారు 12 కి.మీలలో సెలయేరు నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. ఆ పక్కనే వరసగా తంతి పందిరి, దొరమడుగు, సీతలమడుగు, తంగశాల, పెద్దక్కమడుగు, ఉబ్బలమడుగు, సిద్ధేశ్వరగుడి, సద్ధికూటిమడుగు, అంజూరుగంగ, దోగుడుబండ జలపాతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని సీతాళం అని పిలుస్తారు. సిద్ధేశ్వరగుడి నుంచి 3కిలోమీటర్లు కొండపై ప్రయాణించడం కష్టసాధ్యం కావడంతో పర్యాటకులు ఉబ్బలమడుగుకే పరిమితవువుతుంటారు. ఈ ప్రాంతాలను సందర్శించడానికి అటవీశాఖ నామవూత్రపు రుసుముతో సహాయకులను ఏర్పాటు చేసింది.
తంతిపందిరి (తన్నీర్ పందల్) : బ్రిటిష్ హయాంలో చేపల పెంపకం కోసం ఎంపిక చేసిన ప్రాంతమే ఈ తన్నీర్ పందిల్, ఇప్పుడు తంతిపందిరిగా మారింది. వరదయ్యపాళెం నుంచి ఇక్కడ వరకు వెళ్లేందదుకు తారు రోడ్డు ఉంది. ఉబ్బలమడుగు వరకు వెళ్లలేనివారు ఇక్కడి మడుగులోనే సేద తీరుతుంటారు.
ఎన్నో మడుగులు : తంతి పందిరి నుంచి 3కిలో మీటర్లు దూరంలో ఉబ్బలమడుగు ఉంది. వాహనల్లో వెళ్లుందుకు గ్రావెల్ మార్గం నిర్మించారు. ఇక్కడే దొరమడుగు, మామిడి చెట్ల మడుగు, తంగశాల మడుగు, వుూలమడుగు, చద్దికూటి మడుగులున్నాయి. శివరాత్రి పర్వదినం రోజున ఆర్‌టీసీ ప్రత్యేక సర్వీసులను నడుపుతుంది. మిగిలిన రోజుల్లో ఆటోలు నడుస్తుంటాయి.
ఎగువ శీతాలం : సువూరు 300అడుగుల నుంచి పడుతున్న జలపాతం. పక్కనే లోతైన నీటి వుడుగు. గొడుగులా ఇరువైపులా వ్యాప్తించి వుండే కొండవంపు. ఇది చాలా అందమైన ప్రాంతం. తెలుగు చిత్రసీవుకు వుద్రాసు కేంద్రంగా వున్నప్పుడు ఎక్కువగా ఉబ్బలవుడుగులో షూటింగులు జరిగేవి.
సిద్ధులకోన : పూర్వం మునులు ఈ ప్రాంతంలో తపస్సు చేసేవారు. అందుకే దీనికి సిద్ధులకోన అనే పేరు వచ్చింది. ఇక్కడకు వెళ్లాలంటే ట్రాక్టరు వంటి వాహనాలు లేదా, కాలినడకన 2కి.మీ వెళ్లాల్సి ఉంటుంది. భక్తులు పక్కనే ఉన్న సిద్ధుల మడుగులో స్నానాలు ఆచరించి సిద్ధేశ్వరస్వామిని దర్శించుకుంటారు.
దిగువశీతాలం : లోతైన మడుగులు, నిలువెత్తు జలపాతాలకు నెలవు ఈ దిగువశీతాలం. రెండు కొండ చరియల నడుమ ఉండే ఈ ప్రాంతాల్లో ఎటుచూసినా తేనెతుట్టెలు కనిపిస్తుంటాయి. సిద్ధులకోన నుంచి కొండబండల నడుమ 2కి.మీ దూరం కాలినడకన దిగువశీతాలం వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడున్న నీటి మడుగులు రెండు తాటిచెట్లకు పైగా లోతున్నా నీరు స్వచ్ఛంగా ఉండడంతో లోపలి రాళ్లు సైతం కనిపిస్తూ పర్యాటకులను తికమకకు గురిచేస్తాయి. మడుగులోకి దిగితే ఎంత వేసవిలోనైనా నీరు చల్లగా ఉంటూ వణికిస్తాయి..
సందర్శకులను ఆకర్షిస్తున్న ఉబ్బల మడుగు
ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం
ఎకో టూరిజం కేంద్రంగా అభివృద్ధి
ఆహ్లాదం.. విజ్ఞానం
పర్యాటకులకు ఆహ్లాదంతో పాటు విజ్ఞానం అందించే దిశగా అటవీశాఖ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఉబ్బల మడుగును ఎకో టూరిజంగా తీర్చిదిద్దుతోంది. ఈ క్రమంలోనే చెట్లు, వాటి శాసీ్త్రయ నామాలు తదితర విశేషాలతో దారి పొడవునా సూచిక బోర్డులను ఏర్పాటు చేసింది. రాజులు వాడిన ఫిరంగి, టన్ను బరువుండే తిరగలి, పూసలదిబ్బ, ఎలిజబెత్ రాణి బంగ్లా, పాలేగాళ్లు, వారి తోటలు ఇలాంటి విశేషాలన్నీ పర్యాటకులు తెలుసుకోవాల్సినవే.
మరిన్ని వసతులు
ఉబ్బలమడుగు వచ్చే సందర్శకులకు మరిన్ని వసతులు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నాం. ముఖ్యంగా జలపాతాల వద్ద బోటింగ్ పార్క్‌లు, మరో వ్యూ పాయింట్, విశ్రాంత గదులు నిర్మాణానికి ఏపీ టూరిజంతో కలసి ప్రతిపాదనలు పంపించాం. – త్రినాథ్ రెడ్డి, ఎఫ్‌ఆర్‌ఓ, సత్యవేడు
స్వచ్ఛమైన గాలి.. పరిశుభ్రమైన నీరు.. పచ్చటి అడవి.. శ్రవణ
స్వచ్ఛమైన గాలి.. పరిశుభ్రమైన నీరు.. పచ్చటి అడవి.. శ్రవణ
స్వచ్ఛమైన గాలి.. పరిశుభ్రమైన నీరు.. పచ్చటి అడవి.. శ్రవణ
స్వచ్ఛమైన గాలి.. పరిశుభ్రమైన నీరు.. పచ్చటి అడవి.. శ్రవణ


