● ప్రభుత్వ భూముల్లో యథేచ్ఛగా తవ్వకాలు ● చోద్యం చూస్తున్
ప్రభుత్వ భూముల్లో తెల్లరాయి తవ్వకాలతో ఏర్పడ్డ గుంతలు
సాక్షి, టాస్క్‌ఫోర్స్: గూడూరు నియోజకవర్గంలో కూటమి నేతలు ఖనిజ సంపదను కొల్లగొడుతున్నారు. వారికి అండగా ‘నేను ఉన్నా’ అని స్థానిక ప్రజాప్రతినిధి భరోసా ఇస్తుండడంతో వారు మరింత రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ భూముల్లో తెల్లరాయిని తవ్వి రాత్రికి రాత్రే అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటిదే గూడూరు రూరల్ మండలంలో చోటు చేసుకుంది.
ఆక్రమించి..అక్రమంగా తరలించి
మండల పరిధిలోని చెన్నూరు రెవెన్యూ బిట్–2 తుంగపాళెం గ్రామ సమీపంలో మూత పడిన మైనింగ్ ఫ్యాక్టరీకి ఎదురుగా 70 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. వీటిలో విస్తారంగా తెల్లరాయి, వర్మిక్యులేట్‌లు దొరుకుతున్నాయి. స్థానిక రెవెన్యూ పరిధిలోని ఇద్దరు నాయకులు వాటిపై కన్నేశారు. తమ అనుచరులతో ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపడుతున్నారు. ఆపై తెల్లరాయిని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
రాత్రిపూట బ్లాస్టింగ్..పగలు తరలింపు
సదరు భూముల్లో గత నెల రోజులుగా రాత్రి పూట బ్లాస్టింగ్ కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. బ్లాస్టింగ్ అనంతరం తవ్వకాలు చేసి పట్టపగలు లోడింగ్ చేసుకుంటున్నారు. ఇలా తవ్వి తీసిన తెల్లరాయిని మూత వేసి ఉన్న మైనింగ్ కంపెనీలోకి తరలించి అక్కడ గ్రేడింగ్ చేసి తరలిస్తున్నట్లు సమాచారం. ఇదేగాక విద్యుత్ టవర్లకు పక్కన కూడా తవ్వేస్తుస్తున్నారు. దీంతో సమీప గ్రామాల రైతులు భయాందోళనకు లోనవుతున్నారు.
రోజూ టిప్పర్లలో తరలింపు
రాత్రి సమయంలో ప్రభుత్వ భూముల్లో బ్లాసింగ్ చేసి గ్రేడింగ్ చేసిన తెల్లరాయిని టిప్పర్లలో నింపి తరలిస్తున్నారు. బ్లాస్టింగ్ వల్ల చుట్టుపక్కల ఉన్న మూడు గ్రామాల వారికి కంటి మీద కునుకు లేకుండా పోతోంది. తెల్లరాయి తరలింపునకు ఎలాంటి అనుమతులు లేకపోయినా అధికార పార్టీ నాయకుల అండతో యథేచ్ఛగా తరలించేస్తునఆనరు. ఎవరైనా అడిగితే స్థానిక ప్రజాప్రతినిధికి చెందిందని చెప్పడంతో అధికారులు కూడా అటువైపు వెళ్లేందుకు సాహసించడంలేదు.


