ప్రైవేట్ స్కూళ్లపై ఫిర్యాదు
తిరుపతి అర్బన్ : వేసవి నేపథ్యంలో జిల్లాలోని అన్ని పాఠశాలలు ఒంటి పూట తరగతులు నిర్వహించాలని జారీ చేసిన ఆదేశాలను ప్రైవేట్ స్కూళ్ల నిర్వాహకులు బేఖాతర్ చేస్తున్నారని విద్యార్థి సంఘాల నేతలు మండిపడ్డారు. శుక్రవారం ఈ మేరకు డీఈఓ కేవీఎన్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించి డీఈఓ మాట్లాడుతూ పకడ్బందీగా తనిఖీలు చేపడతామని, ఉదయం నుంచి సాయంత్రం వరకు తరగతులు నిర్వహిస్తున్న ప్రైవేట్ స్కూళ్లపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నేతలు హేమాద్రి యాదవ్, ప్రేమ్ కుమార్, లోకేష్, యుగంధర్, ముని , సుకుమార్, వెంకటేష్ పాల్గొన్నారు.


