‘కళైకావేరి’తో ఎస్వీయూ ఒప్పందం
తిరుపతి సిటీ : తమిళనాడులోని తిరుచిరాపల్లెకు చెందిన కళై కావేరి లలిత కళల కళాశాలలో పలు అంశాలపై ఎస్వీయూ కళలప్రదర్శన అధ్యయన విభాగం శుక్రవారం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు అధ్యాపకులు, విద్యార్థులు పరస్పర అభ్యసన, పరిశోధన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించునే వెసులుబాటు ఉంటుంది. కార్యక్రమలో ఆచార్య శంకర్ గణేష్, ఆచార్య ఉమామహేశ్వరి, డాక్టర్ పత్తిపాటి వివేక్, ఉదయ భాస్కర్ పాల్గొన్నారు.
రుయాలో ప్రపంచ డౌన్స్ సిండ్రోమ్ దినోత్సవం
తిరుపతి తుడా: రుయా పీడియాట్రిక్స్ విభాగం ఆధ్వర్యంలో డీఈఐసీ భవనంలో శుక్రవారం ప్రపంచ డౌన్స్ సిండ్రోమ్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ బాలకృష్ణనాయక్, రుయా ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదన్, పీడియాట్రిక్స్ హెచ్‌ఓడీ డాక్టర్ మనోహర్ కార్యక్రమంలో పాల్గొని డౌన్స్ సిండ్రోమ్ లక్షణాలు, కారణాలు, నిర్వహణ అనే అంశాలపై పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రదీప్, డాక్టర్ గుణశేఖర్, ఝాన్సీరాణి, డాక్టర్ సుప్రజ దేవి, దీప్తి, సరస్వతి, చైతన్య పాల్గొన్నారు.
పుత్తూరు రైటర్ వీఆర్‌కు!
– రాజకీయ లొత్తిళ్లే కారణమా?
పుత్తూరు : స్థానిక పోలీస్ స్టేషన్‌లో రైటర్‌గా పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ బి.రవి తిరుపతి ఎస్పీ ఆదేశాల మేరకు వీఆర్ (వేకన్సీ రిజర్వుడు)కు బదిలీ అయ్యారు. గురువారం జరిగిన ఈ బదిలీ కేవలం స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. పోలీస్ స్టేషన్‌కు వివిధ కేసుల్లో పట్టుకొస్తున్న నిందితులను స్థానిక టీడీపీ నాయకులు వారు మావారే వదిలి పెట్టాలంటూ పోలీసులపై అధికార జులుం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఇలాంటి ఘటనలపైనే ఇలా అయితే మా ఉద్యోగాలు ఎలా చేయాలంటూ రైటర్ రవి ప్రశ్నించడంతో అతనిని టార్గెట్ చేసి వీఆర్‌కు పంపించినట్లు తెలుస్తోంది. చూశారా మేము చెప్పింది చేయకపోతే ఇలానే ఉంటుందంటూ స్థానిక పోలీసు ఉన్నతాధికారులకు టీడీపీ నాయకులు హెచ్చరికలు పంపుతున్నారు. రాజకీయంగా తమ పలుకుబడిని చూపేందుకే చిరుద్యోగిపై ప్రతాపం చూపారంటూ పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది.
నేటి నుంచి అంతర్జాతీయ వర్క్‌షాపు
తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీ వేదికగా శనివారం నుంచి ఈ నెల 28వ తేదీ వరకు రామరంజన్ ముఖర్జీ ఆడిటోరియంలో శాబ్దబోధ మీమాంశ అనే అంశంపై వారం రోజులపాటు అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఈ వర్క్‌షాప్‌లో పద్మభూషణ నవలపాకం శతకోప రామానుజతాచార్య రచనలో వివరించిన శాబ్దబోధంపై తత్వశాస్త్ర, భాషా విశ్లేషణ జరగనుంది. దర్శన, వ్యాకరణ విభాగాలలో పరిశోధన విద్యార్థులు, అధ్యాపకులను లక్ష్యంగా చేసుకుని, స్పోటవాదం, అభిహితాన్వయ, అన్వితాభిధానవాదం వంటి ముఖ్యమైన అంశాలపై మహాపండితులు చర్చించనున్నారు. ఆసక్తిగల వారు రిజిస్ట్రేషన్‌తో పాటు మరిన్ని వివరాలకోసం ప్రొఫెసర్ సి రంగనాథన్ 94409 19106, డాక్టర్ ఓజీపీ కళ్యాణ శాస్త్రి 88856 73667లను సంప్రదించాలని వర్సిటీ అధికారులు ఒక ప్రకటలో తెలిపారు.
‘కళైకావేరి’తో ఎస్వీయూ ఒప్పందం


