రాపూరు : శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కండలేరు జలాశయాన్ని చైన్నె మెట్రో వాటర్ బృందం బుధవారం సందర్శించింది. ఈ మేరకు అధికారులతో సమావేశం నిర్వహించింది. చైన్నె నగరవాసుల దాహార్తి తీర్చేందుకు కండలేరు జలాలను ఏప్రిల్ నుంచి విడుదల చేయాలని కోరింది. సమావేశంలో ఎస్‌ఈ రాధాకృష్ణారెడ్డి, చైన్నె మెట్రో వాటర్ సీఈ జానకి, ఎస్సీ మహేష్ నాగార్జున్, ఈఈ తిలైకరాసి, ఏఈలు రాజా, భరత్, తెలుగుగంగ ఈఈ విజయకుమార్‌రెడ్డి, డీఈ విజయరామిరెడ్డి, ఏఈ తిరుమలయ్య, అనిల్, శ్రీనివాసరావు, అనిల్‌బాబు పాల్గొన్నారు.


