తిరుపతి అర్బన్ : పర్యాటక రంగం అభివృద్ధికి అధికారులు సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో టూరిజం, ఫారెస్ట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో తిరుపతి జూపార్క్, కల్యాణి డ్యామ్‌ను అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రధానంగా పర్యాటక ప్రాంతాల్లో సందర్శకులను ఆకట్టుకునేలా స్టాల్స్ ఏర్పాటు చేయాలని కోరారు. ఆ దిశగా హస్త కళాకారులు, చేతివృత్తుల వారిని ప్రోత్సహించాలని చెప్పారు. ఎకో టూరిజం ప్రమోషన్ కోసం హబ్ అండ్ స్పోక్స్ మోడల్ పద్ధతిలో హ్యాండీక్రాఫ్ట్‌స్ మెన్ తదితరులకు జీవనోపాధి కల్పించాలని తెలిపారు. ప్రతి ఒక్కరిలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన, బాధ్యత పెంపొందించాలని స్పష్టం చేశారు. సూచించారు. జిల్లాలో ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించే ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేయాలని కోరారు. సమావేశంలో పర్యాటక శాఖ ఆర్‌డీఎఫ్ రమణ ప్రసాద్ పాల్గొన్నారు.
అంగన్‌వాడీ.. ఒంటిపూట బడి
తిరుపతి అర్బన్ : అంగన్‌వాడీ స్కూళ్లను ఒంటిపూట నిర్వహించాలని ఐసీడీఎస్ పీడీ వసంతాబాయి ఆదేశించారు. బుధవారం ఆమె మాట్లాడుతూ మే 31 వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే పాఠశాలలు నిర్వహించాలని స్పష్టం చేశారు. వేసవి నేపథ్యంలో టీచర్లు, హెల్పర్లు అందుబాటులో ఉంటూ పిల్లలకు తాగునీటి వసతి కల్పించాలని సూచించారు.
25న ప్రసన్నుడి కల్యాణోత్సవం
తిరుపతి కల్చరల్ : అప్పలాయిగుంటలోని శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఈనెల 25వ తేదీన స్వామివారి కల్యాణమహోత్సవం నిర్వహించనున్నారు. ప్రతి నెలా శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని ఉదయం 10.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి వారికి కల్యాణం నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలో ఉదంపతులు రూ.300లు చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చని ఆలయ అధికారులు తెలిపారు.
పర్యాటక అభివృద్ధికి కృషి


