ఎర్రచందనం వేలం కంటే.. పుష్ప సినిమా ఆదాయమే ఎక్కువ | - | Sakshi
Sakshi News home page

ఎర్రచందనం వేలం కంటే.. పుష్ప సినిమా ఆదాయమే ఎక్కువ

Mar 15 2025 12:39 AM | Updated on Mar 15 2025 12:39 AM

ఎర్రచందనం వేలం కంటే.. పుష్ప సినిమా ఆదాయమే ఎక్కువ

ఎర్రచందనం వేలం కంటే.. పుష్ప సినిమా ఆదాయమే ఎక్కువ

● మాజీ ఏపీసీసీఎఫ్‌, రిటైర్డ్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి మల్లికార్జునరావు

తిరుపతి మంగళం : ఎరచ్రందనం విక్రయాల ద్వారా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం కంటే స్మగ్లింగ్‌పై తీసిన పుష్ప–2 సినిమాకే ఎక్కువ ఆదాయం వచ్చిందని మాజీ ఏపీ సీసీఎఫ్‌, రిటైర్డ్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి పి.మల్లికార్జునరావు తెలిపారు. తిరుపతిలోని మారస సరోవర్‌ హోటల్లో నేషనల్‌ బయో డైవర్సిటీ అథారిటీ, ఏపీ బయో డైవర్సిటీ బోర్డు సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన నిపుణుల కమిటీ(ఎక్స్‌ వర్డ్‌ కమిటీ) సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. రైతులు ఎట్టిపరిస్థితుల్లోనూ ఎరచ్రందనం తోటలను పెంచకుండా ఆటవీశాఖ ఆదేశించాలన్నారు. రైతులు పెంచుతున్న ఎరచ్రందనం వృక్షాలు శేషాచలం అడవుల్లోని చెట్ల నాణ్యత తరహాలో ఉండడం లేదన్నారు. స్మగ్లర్లు రైతులను అడ్డు పెట్టుకుని గేమ్‌ అడుతున్నట్టు సమాచారం ఉందన్నారు. అటవీశాఖ రైతులకు ఇచ్చే అనుమతి పత్రాలను స్మగ్లర్లు దక్కించుకుని దుర్వినియోగం చేస్తున్నట్టు తెలుస్తోందన్నారు. బయో డైవర్సిటీ సంరక్షణలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఎరచ్రందనం ప్రాధాన్యతను గుర్తించకుండా, స్మగ్లింగ్‌పై పుష్పలాంటి సినిమా తీయడం సరైంది కాదన్నారు. ఎరచ్రందనం వేలం ప్రారంభమైన నాటి నుంచి ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం కంటే పుష్ప– 2 సినిమాకు వచ్చిన రూ.1,800 కోట్లే ఎక్కువని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement