శభాష్‌ అభి! | - | Sakshi
Sakshi News home page

శభాష్‌ అభి!

Jul 5 2023 1:38 AM | Updated on Jul 5 2023 1:38 PM

ఎమ్మెల్యే భూమన, అభినయ్‌రెడ్డిని అభినందిస్తున్న ముఖ్యమంత్రి  - Sakshi

ఎమ్మెల్యే భూమన, అభినయ్‌రెడ్డిని అభినందిస్తున్న ముఖ్యమంత్రి

‘శభాష్‌ అభి’ అని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, తిరుపతి కార్పొరేషన్‌ డిప్యూటీ మేయ ర్‌ భూమన అభినయ్‌రెడ్డి

తిరుపతి మంగళం: తిరుపతి చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా మాస్టర్‌ప్లాన్‌ రోడ్ల అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్నారు.. ‘శభాష్‌ అభి’ అని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, తిరుపతి కార్పొరేషన్‌ డిప్యూటీ మేయ ర్‌ భూమన అభినయ్‌రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు.

చిత్తూరు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంగళవారం తిరుపతి విమానాశ్రయానికి విచ్చేసిన సీఎంను తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, డిప్యూటీ మేయర్‌ భూమన అభినయ్‌రెడ్డి కలిసి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా భూమన అభినయ్‌రెడ్డిని.. శభాష్‌ అభి అంటూ భుజం తట్టి ప్రోత్సహించారు. ‘అన్నా నిత్యం ప్రజల్లోనే ఉంటూ.. వారితో మమేకమై చేస్తున్న తిరుపతి అభివృద్ధి భేష్‌ అన్న’ అని ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డికి కితాభిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement