సూళ్లూరుపేట : పట్టణంలోని చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో ఈ నెల 8 నుంచి 14వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉత్సవాల కోసం ప్రత్యేకంగా కమిటీలు నియమించినట్లు చెప్పారు. మీడియా కమిటీకి చైర్మన్‌గా కనసాని వేణుగోపాల్, పుడ్ కమిటీకి కె.రామ్మోహన్‌రెడ్డి, పబ్లిసిటీ కమిటీకి అల్లూరు అనిల్‌కుమార్‌రెడ్డి, రిసెప్షన్ కమిటీలకు కళత్తూరు జనార్ధన్‌రెడ్డి, దబ్బల శ్రీమంత్‌రెడ్డి, సెక్యూరిటీ కమిటీకి భాస్కర్‌రెడ్డి, వాటర్, మజ్జిగ స్టాల్స్ కమిటీకి వంకా దినేష్, శానిటేషన్ కమిటీకి ఓలేటి బాలసత్యనారాయణ, గ్రామోత్సవ కమిటీకి కర్లపూడి సురేష్‌బాబు, సాంస్కృతిక కమిటీకి ఎంఎస్ రెడ్డి, ఉమెన్ వలంటీర్స్ కమిటీకి పద్మజ, బి.సునీత, మారెమ్మ, ఎన్.నాగమణి, తెప్పోత్సవ కమిటీకి నరేష్, మహిషాసుర మర్థిని కమిటీకి కళత్తూరు శేఖర్‌రెడ్డి, సుడిమాను కమిటీకి జెట్టి వేణుయాదవ్, ట్రాఫిక్ కమిటీకి మీజూరు రామకృష్ణారెడ్డి, ప్రసాదం కమిటీకి అయితా శ్రీధర్‌ను చైర్మన్లుగా నియమించినట్లు వివరించారు.


