రేడియో.. ఓ మధుర జ్ఞాపకం

World Radio Day 2024 - Sakshi

మిరుదొడ్డి(దుబ్బాక): రేడియో ఈ పేరు వింటే చాలు ఒకప్పుడు కాలక్షేపానికి వినోద ప్రచార సాధనంగా నిలిచింది. నాడు రేడియోలో వచ్చే ధ్వని కార్యక్రమాలు మనసుతో చూసేలా కంటికి కదలాడేవి. సుప్రభాత పాటలతో పల్లెలను, పట్టణాలను మేలుకొల్పేవి. సినిమా, జానపద గీతాల ప్రసారాలతో మనసును ఉరకలెత్తించేవి. మధ్యాహ్నం కారి్మక లోకాన్ని తట్టి లేపేవి. సాయంత్రం రేడియోలో వచ్చే వార్తలు, వ్యవ సాయ సాగు పద్ధతులు జనరంజకంగా పలకరించేవి. అలసిన ప్రతి ఒక్కరికీ కమ్మనైన సంగీతంతో మనసును ఓలలాడించి నిద్ర పుచ్చేవి. కానీ శాస్త్ర పరిజ్ఞానం పెరిగిపోయి కలర్‌ టీవీలు, సెల్‌ ఫోన్‌ల రాకతో రేడియోలు కనుమరుగయ్యాయి. రేడియోతో ఉన్న తమ అనుబంధాన్ని ఒదులుకో లేక కొందరు రేడియో ప్రియులు రేడియోలను భద్రంగా దాచుకుంటూ వాటితో ఉన్న జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. 
 
కనిపించని రేడియో 
శాస్త్ర పరిజ్ఞానం పెరిగిపోవడంతో మొదట బ్లాక్‌ అండ్‌ వైట్‌ టీవీల రాకతో కాస్త వెనుక బడ్డ రేడియోలు కలర్‌ టీవీలు ఇంటింటికీ రంగ ప్రవేశం చేశాక పూర్తిగా మూలనపడ్డాయి. ప్రస్తుతం ప్రతీ ఒక్కరి జేబులో సెల్‌ ఫోన్లు మార్మోగి పోతుండడంతో రేడియోలు పూర్తిగా కనురుగయ్యాయి. సెల్‌ఫోన్‌లో ప్రపంచం నలు మూలల్లో ›జరిగే వార్తా విశేషాలు ఎప్పటికప్పుడూ తెలిసి పోతుండటంతో రేడియోల వినియోగం ప్రశ్నార్థకంగా మారింది.  

రేడియో దినోత్సవం 
రేడియో కనుమరుగైపోతున్న క్రమంలో యునె స్కో 36వ కాన్ఫరెన్స్‌ సమావేశంలో 2011 నవంబర్‌ 13న తీసుకున్న తీర్మాణం ప్రకారం 2012 ఫిబ్రవరి 13న తొలి సారిగా అంతర్జాతీయ రేడియో డేగా ప్రారంభమయ్యాయి. 

ఇప్పటికీ దాచుకున్నా.. 
నా చిన్నప్పుడు ఎక్కువ రేడియోతోనే పోపతి ఉండేది. అప్పుడు రేడియోలు పెద్ద పెద్ద వాళ్ల ఇళ్లల్లో ఉంటుండే. నాకు కూడా ఒక రేడియో కొనుక్కోవాలని అనిపించింది. నాడు బ్యాటరీలతో రేడియోలు పని చేస్తుండే. రాను రాను ఇంటింటికీ కలర్‌ టీవీలు, సెల్‌ ఫోన్లు రావడంతో రేడియోలు మూలకు పడ్డాయి. ఇప్పుడు రేడియోలు వాడాలంటే బ్యాటరీలు మార్కెట్‌లో దొరకడం లేదు. వాటిని రిపేరు చేసే వాళ్లు లేకుండా పోయారు. ఇప్పటికీ రేడియోను భద్రంగా దాచుకున్న. 
– ఎర్రోల్ల బాల్‌నర్సయ్య, మిరుదొడ్డి 

whatsapp channel

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags:  

Read also in:
Back to Top