
మహబూబ్‌నగర్: తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు పుణ్యమా.. నిత్యం ఎక్కడో ఒక చోట గొడవకు దారితీస్తోంది. నారాయణపేట నుంచి మక్తల్ మధ్య తిరిగే షటిల్ బస్సులో ఇద్దరు మహిళలు సీట్ల కోసం చెప్పులతో కొట్టుకున్న సంఘటన చోటు చేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం నారాయణపేట (Narayanpet) బస్టాండులో బస్సు ఎక్కిన మహిళలు సీట్ల కోసం మాటలు, చీవాట్లతో ఘర్షణ మొదలైంది.
చివరికి అది చెప్పులతో కొట్టుకుని దుస్తులు చింపుకొనే వరకు వచ్చింది. ఈ గొడవ మక్తల్ (Makthal) బస్టాండ్‌కు వచ్చే వరకు గంటసేపు కొనసాగింది. సర్దిచెప్పేందుకు ప్రయత్నించిన కండక్టర్‌పై కూడా బూతు పురాణం అందుకోవడంతో వెనక్కు తగ్గారు. తోటి ప్రయాణికులు కూడా వారిని నిలువరించలేక.. చూస్తూ ఉండిపోయారు.
చదవండి: కన్నీటి నిశ్చితార్థం.. తల్లిదండ్రులు, ముగ్గురు పిల్లలు దుర్మరణం