ఆర్టీసీ బస్సులో మహిళ హల్‌చల్‌.. బట్టలు ఊడదీసుకుని..

Woman Hulchul In Rtc Bus Hyderabad - Sakshi

సాక్షి,మలక్‌పేట(హైదరాబాద్‌): ఆర్టీసీ బస్సులో గురువారం ఓ మహిళ హల్‌చల్‌ చేసింది. తోటి ప్రయాణికులను కొట్టి, తన మూడేళ్ల కూతురును బస్సు నుంచి కిందికి విసిరేసింది. ఆందోళన చెందిన బస్సు డ్రైవర్, కండక్టర్‌ మలక్‌పేట పోలీసులను ఆశ్రయించారు. కండక్టర్, ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం... 37 వయస్సు కలిగిన వివాహిత తన మూడేళ్ల కూతురుతో తన ఇంటికి వెళ్లడానికి అఫ్జల్‌గంజ్‌లో రాత్రి 7 గంటలకు హయత్‌నగర్‌–2 డిపోకు చెందిన బస్సు ఎక్కింది. అక్కడ నుంచి ఎల్‌బీనగర్‌కు టికెట్‌ తీసుకుంది. అఫ్జల్‌గంజ్‌ నుంచి బస్సు బయలుదేరి వస్తుండగా ఎంజీబీఎస్‌కు రాగానే ఆమె బస్సులో గొడవ చేయడం మొదలు పెట్టింది.

బట్టలు ఊడదీసుకోవడం, పక్క నున్న వారిని దూషించడం చేసింది. కండక్టర్‌ వారించబోగా అతడిపై కూడా చెయ్యి చేసుకుంది. ఎన్‌టీఆర్‌ నగర్‌ వెళ్లడానికి మలక్‌పేటలో 60 సంవత్సరాల మహిళ బస్సు ఎక్కి ఆమె పక్కన ఖాళీగా ఉన్న సీట్లో కూర్చుగా ఆమెను కూడా కొట్టింది. తన కుమార్తెను బస్సు కిటికీ నుంచి విసిరేయడానికి చూడగా ప్రయాణికులు అడ్డుకున్నారు. దీంతో బస్సు డ్రైవర్‌ మలక్‌పేట పీఎస్‌ ఎదురుగా బస్సు ఆపాడు. బస్సు డోర్‌ నుంచి పాపను కిందికి విసిరేసింది. బస్సు టైర్ల కింది కూర్చుంది. అదృష్టవశాత్తు పాపకు ఎలాంటి గాయా లు కాలేదు. కండక్టర్‌ పోలీసులకు ఈ విషయం చెప్పాడు.

బస్సును కదలనీయకుండా బస్సు టైర్లను ఆనుకుని కూర్చుంది. మహిళా పోలీసులు, కొందరు స్థానికులు యువతులు ఆమె దగ్గరకు నచ్చజెప్పి దుస్తులు తొడి ఆమెను, పాపను పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆ మహిళ వివరాలు అడిగి తెసుకుని సరూర్‌నగర్‌లో ఉండే ఆమె అక్కకు అప్పగించారు. మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్లే అప్పుడప్పుడు ఇలా ప్రవర్తిçస్తోందని కుటుంబ సభ్యులు తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top