మెడకు చున్నీ బిగించి భర్తను చంపిన భార్య | Wife killed husband | Sakshi
Sakshi News home page

మెడకు చున్నీ బిగించి భర్తను చంపిన భార్య

Aug 22 2024 7:22 AM | Updated on Aug 22 2024 7:22 AM

Wife killed husband

నిత్యం మద్యం తాగొచ్చి వేధిస్తున్నాడని..   

మియాపూర్‌: నిత్యం మద్యం తాగి వచ్చి వేధిస్తున్న భర్త ఆగడాలను భరించలేకపోయింది ఆ ఇల్లాలు. సహనం కోల్పోయి అతని మెడకు చున్నీ బిగించి చంపేసిన ఘటన మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ దుర్గా రామలింగ ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. అసోం రాష్ట్రానికి చెందిన అలీ హుస్సేన్‌ లస్కర్‌ (35), రుస్తానా బేగం లస్కర్‌ దంపతులు. 

వీరికి ముగ్గురు సంతానం.  బతుకుదెరువు నిమిత్తం రెండేళ్ల క్రితం నగరానికి వచ్చి మియాపూర్‌ హాఫీజ్‌పేటలోని ప్రేమ్‌నగర్‌ కాలనీలో ఉంటూ కూలీ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ  క్రమంలో అలీ హుస్సేన్‌ లస్కర్‌ మద్యానికి బానిసయ్యాడు. నిత్యం మద్యం తాగి వచ్చి భార్యను వేధించేవాడు. పిల్లలను కొట్టేవాడు. సోమవారం రాత్రి అలీ హుస్సేన్‌ లస్కర్‌ మద్యం తాగి ఇంటికి వచ్చాడు. 

భార్య రుస్తానాతో గొడవ పడ్డాడు. మంగళవారం తెల్లవారు జామున మళ్లీ గొడవ పడడంతో సహనం కోల్పోయిన రుస్తానా చున్నీతో భర్త అలీ హుస్సేన్‌ లస్కర్‌ మెడకు బిగించింది. దీంతో అతడు మృతి చెందడంతో అక్కడి ఆమె నుంచి ఆమె పారిపోయింది. మృతుడి సోదరుడు అక్బర్‌ హుస్సేన్‌ ఫిర్యాదు మేరకు మియాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. రుస్తానా బేగంను బుధవారం  అదుపులోకి తీసుకుని విచారణ చేయగా.. భర్త వేధింపులకు విసుగు చెంది చునీతో మెడకు బిగించి తానే హత్య చేసినట్లు అంగీకరించిందని పోలీసులు తెలిపారు.  నిందితురాలిని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.  

 

Advertisement
 
Advertisement
Advertisement