కొడుకును జైలు పాలు చేసిన తల్లి వాట్సాప్‌ స్టేటస్‌

WhatsApp Status Lands Woman's Son Behind Bars in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఒక మహిళ వాట్సాప్‌ స్టేటస్‌ ఆమె కొడుకు అరెస్ట్‌ కావడానికి కారణమయ్యింది. 15నెలల క్రితం నమోదయిన ఒక జ్యూవెలరీ కేసును చేధించడంలో వాట్సాప్‌ స్టేటస్‌ ఉపయోగపడింది. ఈ సంఘటన హైదరాబాద్‌ రాచకొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. జూలై 12, 2019లో సాయి​కిరణ్‌ అనే వ్యక్తి గుడికి వెళ్లి తన ఇంటికి వచ్చేసరికి అతని ఇంటితలుపులు తెరచి ఉన్నాయి. తాళం వేయడం మర్చిపోయానేమో అనుకుంటు లోపలికి వెళ్లిన ఆ వ్యక్తి తన ఇంట్లో బంగారం దొంగిలించినట్లు కనుగొన్నాడు. తన ఇంట్లో చోరి జరిగినట్లు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. 

ఇక ఇన్ని రోజుల తరువాత వారి ఇంటి పక్కన ఉండే మహిళ కిరణ్‌ వాళ్ల ఇంట్లో దొంగిలించిన నగను పెట్టుకొని ఉన్న ఫోటోను వాట్సాప్‌ ద్వారా షేర్‌ చేసింది. ఇది చూసిన కిరణ్‌ అది తమ ఇంట్లో దొంగిలించినదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేయగా ఆమె కొడుకు జితేందర్‌ ఈ దొంగతనానికి పాల్పడినట్లు తెలిసింది. ఈ విషయం అతని తల్లి తెలిసే జరిగిందని పోలీసులు ఆమెకు కూడా నోటీసులు జారిచేశారు. 

చదవండి: హైదరాబాద్‌: యువతుల అదృశ్యం.. టెన్షన్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top