దొంగనుకుని సర్పంచ్‌కు దేహశుద్ధి 

Villagers Attack On Sarpanch Suspicion Of Warangal Nallabelli - Sakshi

సాక్షి, వరంగల్‌: దొంగగా భావించిన గ్రామస్తులు సర్పంచ్‌కు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండలం మామిండ్లవీరయ్యపల్లిలో శుక్రవారంరాత్రి చోటుచేసుకుంది. మామిండ్లవీరయ్యపల్లిలో పెంతల సాంబరెడ్డి, యార రవి మధ్య ఇంటిస్థలం విషయమై కొద్దిరోజులుగా వివాదం నడుస్తోంది. దీనిపై గ్రామపెద్దల సమక్షంలో శుక్రవారం పంచాయితీ పెట్టారు.

అనంతరం రాత్రిపూట ఇరువర్గాల పెద్దమనుషులు వేర్వేరుగా దావత్‌ చేసుకున్నారు. సర్పంచ్‌ అమరేందర్‌తోపాటు పలువురు మాటుకాసి సాంబరెడ్డి పెద్దమనుషుల దావత్‌ దృశ్యాలను మొబైల్‌లో రికార్డు చేస్తుండగా పలువురు గమనించారు. ‘దొంగ, దొంగా’అని అరుస్తూ సర్పంచ్‌పై దాడి చేసి గాయపరిచారు. ఈ మేరకు శనివారం స్థానిక పోలీసులకు ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top