త్వరగా కోలుకోవాలని టీ కాంగ్రెస్‌ ట్వీట్‌‌

Uttam Kumar Reddy Hospitalized With Knee Injury - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆస్పత్రి పాలయ్యారు. ఆయన మోకాలికి గాయమైంది. ఈ విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విటర్‌ ద్వారా తెలిపింది. ఈ మేరకు ‘మోకాలికి తీవ్ర గాయమైన పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి త్వరగా కోలుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం కోరుకుంటుంది’ అంటూ ఓ ఫోటోను ట్వీట్‌ చేసింది. ఆ చిత్రంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మోకాలి పట్టీని (నీ క్యాప్) ధరించారు. నడవటానికి కష్టంగా ఉండటంతో వాకర్ పట్టుకొని నెమ్మదిగా నడుస్తున్నారు. అయితే ఉత్తమ్‌కు ఈ గాయం ఎలా అయ్యిందనే దాని గురించి సమాచారం లేదు. 
 

తమ అధ్యక్షుడు ఉత్తమ్ త్వరగా కోలుకోవాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు డాక్టర్ జే గీతా రెడ్డి ఆకాంక్షించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. ‘యుద్ధ విమానాలు నడిపే మాజీ పైలట్ మాత్రమే కాదు. పుట్టుకతోనే పోరాటయోధుడు. ఉత్తమ్ గారు త్వరగా కోలుకోవాలని మేం కోరుకుంటున్నాం’ అని గీతారెడ్డి ట్వీట్ చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top