
ఢిల్లీ: ఇవాళ సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ జరగనుంది. ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. ఈ కేసును అవినీతి నిరోధక చట్టం కింద కాకుండా ఎన్నికల చట్టాల కింద విచారణ చేయాలని రేవంత్‌రెడ్డి కోరుతున్నారు. ఈ కేసులో తన పేరు తొలగించాలని సండ్ర వెంకట వీరయ్య పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్లపై జస్టిస్ జెకె మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయీ ధర్మాసనం విచారణ జరపనుంది. ఓటుకు నోటు మత్తయ్య కేసులో సుప్రీంతీర్పు కాపీలను ఇవ్వాలని గత విచారణలో న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ఇంప్లిడ్ అయ్యేందుకు అనుమతించాలని అడ్వకేట్ ఆర్యమ సుందరం కోరారు. ఇంప్లీడ్‌ను అనుమతించవద్దని రేవంత్‌రెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా.. సుప్రీంకోర్టును కోరారు.