TSRTC: రాఖీ స్పెషల్‌.. మహిళా ప్రయాణికులకు బంపరాఫర్‌ | TSRTC Will Conduct Lucky Draw On The Occasion Of Rakhi | Sakshi
Sakshi News home page

TSRTC: రాఖీ పండుగ స్పెషల్‌.. మహిళా ప్రయాణికులకు బంపరాఫర్‌

Aug 29 2023 6:32 PM | Updated on Aug 29 2023 7:29 PM

TSRTC Will Conduct Lucky Draw On The Occasion Of Rakhi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో యువతులు, మహిళలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) గుడ్‌న్యూస్‌ చెప్పింది. రాఖీ పౌర్ణమికి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు బంపరాఫర్‌ ప్రకటించింది. ఆడపడుచుల కోసం రాష్ట్రవ్యాప్తంగా లక్కీ డ్రా నిర్వహించాలని పేర్కొంది. ఈ ల‌క్కీ డ్రాలో గెలుపొందిన మ‌హిళ‌ల‌కు ఆక‌ర్షణీయ‌మైన రూ.5.50 లక్షల విలువగల బ‌హుమ‌తులు అందించి.. వారి ప‌ట్ల సంస్థ‌కున్న గౌర‌వభావాన్ని ప్ర‌క‌టించనుంది. ప్రతి రీజియన్ పరిధిలో ముగ్గురికి చొప్పున మొత్తం 33 మందికి బహుమతులను ఇవ్వనుంది. 

ప్రతీ రిజయన్‌లో లక్కీ డ్రా..
వివరాల ప్రకారం.. ఈ నెల 30, 31 తేదిల్లో టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలందరూ ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు. ప్రయాణం పూర్తయ్యాక టికెట్ వెనకాల పేరు, వారి ఫోన్ నంబర్‌ను రాసి.. వాటిని బస్టాండ్లలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్‌లలో వేయాలి. ఆ డ్రాప్ బాక్స్‌లను ఒక చోటికి చేర్చి.. ప్రతీ రీజియన్ పరిధిలో లక్కీ డ్రా నిర్వహించి ముగ్గురి చొప్పున విజేతలను అధికారులు ఎంపికచేస్తారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా విజేతలకు బహుమతులను అందజేస్తారు. 

ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ట్వట్టర్‌ వేదికగా..‘మహిళలకు రాఖీ పౌర్ణమి ఎంతో ప్రత్యేకమైంది. అత్యంత పవిత్రంగా ఈ పండుగను వారు జరుపుకుంటారు. సుదూర ప్రాంతాలకు వెళ్లి మరీ తమ సోదరులకు వారు రాఖీలు కడుతుంటారు. సోదరసోదరీమణుల ఆత్మీయత, అనురాగాలతో కూడిన ఈ పండుగ నాడు.. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు లక్కీ డ్రా నిర్వహించాలని సంస్థ నిర్ణయించింది. 

ఈ నెల 30, 31 తేదిల్లో సంస్థ బస్సుల్లో ప్రయాణించే మహిళలు ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు. టికెట్ వెనకాల పేరు, ఫోన్ నంబర్ రాసి డ్రాప్ బాక్స్ లలో వాటిని వేయాలి. ప్రతి బస్టాండ్, ప్రయాణికుల రద్దీ ప్రాంతాల్లో డ్రాప్ బాక్స్ లను సంస్థ ఏర్పాటు చేసింది. మహిళా ప్రయాణికులందరూ ఈ లక్కీ డ్రాలో పాల్గొని విలువైన బహుమతులను గెలుచుకోవాలని సంస్థ కోరుతోంది. సెప్టెంబర్ 9లోగా లక్కీ డ్రాలు నిర్వహించి.. విజేతలకు బహుమతులను అందజేయడం జరుగుతుంది’ అని తెలిపారు.

ఈ రాఖీ పౌర్ణమి లక్కీ డ్రాకు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని వారు సూచించారు.

ఇది కూడా చదవండి: అందుకే నన్ను టార్గెట్‌ చేస్తున్నారు: ఎమ్మెల్యే సీతక్క

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement