శైవక్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు | TSRTC to operate special buses to temples for Karthika Masam | Sakshi
Sakshi News home page

శైవక్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

Nov 8 2026 4:13 AM | Updated on Nov 8 2026 4:13 AM

TSRTC to operate special buses to temples for Karthika Masam

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల నుంచి బయలుదేరనున్న బస్సులు

40 మంది ఉంటే ప్రయాణికుల చెంతకే..

కార్తీకమాసం సందర్భంగా ఆర్టీసీ ఏర్పాట్లు  

సాక్షి, హైదరాబాద్‌: కార్తీకమాసంలో శైవక్షేత్రాలకు వెళ్లే భక్తుల కోసం నగరం నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శ్రీధర్‌ వెల్లడించారు. ఈ నెల 10 నుంచి డిసెంబర్‌ 8వ తేదీ వరకు ప్రతి సోమవారం ఇవి అందుబాటులో ఉంటాయని తెలిపారు. 40 మంది భక్తులు కలిసి బుక్‌ చేసుకొంటే ప్రయాణికుల వద్దకే బస్సు వస్తుందని చెప్పారు. కాలనీలు, గేటెడ్‌ కమ్యూనిటీలు, తదితర నివాస ప్రాంతాల నుంచి వీటిని నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. 

ఈ రూట్లలోనే..: కరీంనగర్‌ సర్క్యూట్‌లో వేములవా డ, కొమురవెల్లి, కొండగట్టు, ధర్మపురి, వరంగల్‌ సర్క్యూట్‌లో కాళేశ్వరం, వేయిస్తంభాల గుడి, రామప్ప, ఐనవోలు, లక్నవరం వరకు బస్సులు అందుబాటులో ఉంటా యి. అలాగే శ్రీశైలం రూట్‌లో శ్రీశైలం, ఉమామహేశ్వ రం, సోమశిల, కందూరు, జోగుళాంబ గద్వాల, పంచారామాల్లో అన్నవరం, భీమవరం, ద్రాక్షారామం, పాలకొల్లు, సామర్లకోట, అమరావతి, అరుణాచలం, కర్ణాటక లోని హంపి, మురుడేశ్వరాల యం తదితర ప్రాంతాలకు ప్యాకేజీలను బుక్‌ చేసుకో వచ్చు.

కీసర, ముచి్చంతల్, అనంతగిరి, సోమశిల, తదితర ప్రాంతాలకు కూడా బ స్సులు ఉంటాయి. పటాన్‌చెరు, బీరంగూ డ, మియా పూర్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, మల్కా జిగిరి, ఉప్ప ల్, దిల్‌సుఖ్‌నగర్, మెహిదీపట్నం, అత్తాపూర్, రాజేంద్రనగర్‌ తదితర ప్రాంతాల నుంచి ఇవి బయలుదేరుతా యి. బస్సుల బుకింగ్, ఇతర వివరాల కోసం ప్రయాణికులు 9959226160 నంబర్‌ను సంప్రదించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement